Home

»

Latest News

Dont Trouble The Trouble Movie Review Telugu: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ  రివ్యూ 

Oct 1, 2026 11:25PM

-సినిమా పేరు: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్
-న‌టీన‌టులు: ఫాహద్ ఫాజిల్, సారా ఫాలేకర్, సౌరబ్ సచ్ దేవ్, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: బ్రాడ్ ఫ్రాన్సిస్ 
-ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ
-మ్యూజిక్: కాళభైరవ 
-నిర్మాత‌లు: ఎస్ ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
-బ్యానర్స్: ఆర్కా మీడియా వర్క్స్ , షోయింగ్ బిజినెస్ 
-సమర్పణ: ఎస్ ఎస్ రాజమౌళి
-రచన,దర్శకత్వం: శశాంక్ యేలేటి 
-రిలీజ్ డేట్ : అక్టోబర్ 2 ,2026 

స్టార్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్, రాజమౌళి, రాజమౌళి తనయుడు కార్తికేయ, బాహుబలి నిర్మాతలు కలిసి 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' తో థియేటర్స్ లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్, మహేష్ బాబు ల మెప్పు సైతం పొందిన డోంట్ ట్రబుల్ కి  ఈ రోజు మేకర్స్  ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

దివ్య( సారా ఫాలేకర్) అతీంద్రియ శక్తులు కలిగి ఉన్న పాప. బాగా డబ్బున్న ఫ్యామిలీ. తన శక్తి ఎలాంటిదంటే వెళ్తున్న మెట్రో రైలు సైతం ఒక పిడుగుపడినట్టుగా 1000 వాల్ట్ ల విద్యుత్ ప్రవాహంతో పెను విపత్తు సంభవించి  ఆగిపోవాల్సిందే..సూరి (ఫాహద్ ఫాజిల్) అంబులెన్స్  డ్రైవర్..బాగా డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తి. అలా అని  చెడ్డ వ్యక్తి కాదు కానీ డబ్బు  కోసం ఏమైనా చేసే నైజం. సింపుల్ గా చెప్పాలంటే చిన్న సైజు స్వార్దపరుడు.   అలాంటి సూరి దగ్గరకి దివ్య వచ్చి  మా అమ్మ, నాన్నని నేను మ్యాజిక్ చేసి మాయం చేశాను. మా అమ్మ, నాన్నని  నువ్వు తీసుకురాలని అంటుంది. అందుకు సూర్య ఒప్పుకుంటాడు. దివ్య చెప్పేది నిజమేనా!..తన శక్తులు వెనుక ఉన్న కథ ఏంటి? సూరి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు సూరి దగ్గరకే ఎందుకు వచ్చింది? ఆ ఇద్దరి ట్రావెల్ లో ఏం జరిగిందనేదే  డోంట్ ట్రబుల్ గోల ది ట్రబుల్.


ఎనాలసిస్ 

సినిమా స్టార్టింగ్ పది నిమిషాలు పాటు మామూలుగానే ఉన్నా, కథలోకి వెళ్లేకొద్దీ మంచి  సీన్స్ వచ్చాయి. కాకపోతే నెక్స్ట్ ఏం  జరుగుతుందో  ముందుగానే ఊహించేస్తాం. కథకి కీలమైన  బలమైన సన్నివేశాలని సింపుల్ గా తేల్చేసారు. ఆ విధంగా కాకుండా బలమైన సన్నివేశాలపై మరింత ఇంట్రెస్ట్ గా సీన్స్ పుట్టించాల్సింది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే దివ్య, సూరి, మధ్య వచ్చిన అన్ని సీన్స్ బాగున్నాయి. సూరి, ఓల్డ్ సిటీ లోని డాన్ అస్లాం మధ్య వచ్చిన సీన్స్ మాత్రం రొటీన్. ఫ్రెండ్ తో  వచ్చిన సీన్స్  కూడా అంతే ఇంటర్వెల్ తో పాటు ముందు వచ్చిన సుమారు 20 నిమిషాల ట్రాక్ అయితే అదిరిపోయింది.

సెకండ్ హాఫ్ లో చూసుకుంటే సీన్స్ పరంగా చెప్పుకోవడానికి ఏమి ఉండవు. అస్లాం తో దివ్య, సూరి ఫైట్ చేసే ఎపిసోడ్ ని వేరేలా ప్లాన్ చేసి ఉండాల్సింది.ఎందుకంటే అలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూసేసాం. దివ్యని అల్లా ఉద్దీన్ అద్భుత దీపం లా ఉపయోంచాలనుకునే సూరి థాట్ ని మరింత విసృత పరిచి ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించాల్సింది. . దివ్యకి తన ప్రాబ్లమ్ తెలిసినప్పుడు మామూలుగానే ఫీల్ అవుతుంది. అలా కాకుండా  తనకున్న ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యమని సూరిని కోరితే ఫీల్ అయినా వచ్చేదేమో. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ బాగున్నా, మనం ఆ ఇద్దరినీ ఓన్ చేసుకునేలా స్క్రీన్ ప్లే మ్యాజిక్ ని పండించలేకపోయారు.

నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు 

సూరిగా ఫాహద్ ఫాజిల్ సూపర్ గా చేసాడు. తన 'ఆరా' మూవీ చివరి వరకు ఏ మాత్రం తగ్గకుండా సూరి నే మనతో ఉన్నాడనేలా క్యారక్టర్ లో జీవించి పడేసాడు. దివ్యగా సారా ఫాలేకర్ సైతం ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. ఎంతలా అంటే ముందు ముందు ఎలాంటి సినిమాలో అయినా పాప పెర్ఫార్మ్ వస్తే తనే గుర్తుకొస్తుంది. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన సౌరబ్ సచ్ దేవ్, మహేష్ మంజ్రేకర్, సుబ్బరాజు  తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు సూపర్ గా చేసారు. ముఖ్యంగా సౌరబ్ సచ్ దేవ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక రేంజ్ లో ఉంది. తనే ముసలి బాబాగా కూడా చేసి మెప్పించాడు.  శశాంక్ యేలేటి రచన పరంగాను, దర్శకత్వం పరంగాను పర్వాలేదనిపించాడు. డైలాగ్స్  సో సో.బ్రాడ్ ఫ్రాన్సిస్ ఫొటోగ్రఫీ కాళభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మణ విలువలు మాత్రం సూపర్. 

బలాలు 
ఫాహద్ పెర్ఫార్మెన్స్ 
సారా ఫాలేకర్
ప్రొడక్షన్ వాల్యూస్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

బలహీనతలు 
స్క్రీన్ ప్లే బలంగా లేకపోవడం
నెక్స్ట్ ఏం జరుగుతుందనేది మనకి ముందే తెలిసిపోతుండటం

చివరిగా చెప్పాలంటే కొత్తగాలేదు..క్వాలిటీ గా ఉంది                                                                                                                                                     

రేటింగ్ 2 .75 /5                           

                                                                                                                                   అరుణాచలం 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com