
కోలీవుడ్ స్టార్ సూర్య, యంగ్ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలను సమకూరుస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన 'ది వెడ్డింగ్ సాంగ్' లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. పెళ్లి వేడుకల్లోని ఆనందం, కుటుంబ సభ్యుల సందడి, ఆత్మీయ అనుబంధాలను ప్రతిబింబించేలా ఈ పాటను ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. పాట ప్రారంభం నుంచే పెళ్లి పండగ వాతావరణం, రంగుల కోలాహలం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ వెడ్డింగ్ సాంగ్‌లో మంగళవాయిద్యాలు, సన్నాయి మేళాలు, సాంప్రదాయ సంగీత స్వరాలు కలగలిపి పెళ్లి కళను ఉట్టిపడేలా చేశాయి. తాళి కట్టే మధుర ఘట్టాన్ని, ఇరు కుటుంబాల మధ్య వ్యక్తమయ్యే ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా సాహిత్యం సాగింది. సూర్య మార్క్ స్క్రీన్ ప్రెజెన్స్, మమితా బైజు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటలోని విజువల్స్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఉత్సాహభరితమైన మెలోడీ ట్యూన్ ఈ పాటకు ప్రాణంగా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. సూర్య స్వయంగా ఈ పాటను పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
The Wedding Song, Vishwanath and Sons, Suriya, Mamitha Baiju






