
నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu)తనయుడు మంచు విష్ణు(Vishnu)హీరోగా పలు సక్సెస్ లు చేసాడు. ప్రీవియస్ మూవీ కన్నప్ప తో నటుడుగా మరో మెట్టు పైకి ఎక్కాడని చెప్పవచ్చు దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు విష్ణు అప్ కమింగ్ డీటెయిల్స్ గురించి వెయిట్ చేస్తున్నారు.
విష్ణు(Vishnu)కెరీర్ లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఢీ' చిత్రానికి సీక్వెల్ తీసుకొచ్చేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నాడానే టాక్ వినిపిస్తుంది. సీక్వెల్ కథ సిద్ధమవ్వడమే ఆలస్యం, మరుసటి రోజే షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని స్వయంగా వెల్లడించడంతో పాటు జెనీలియాతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనితో పాటు ఇండియన్ డ్యాన్స్ ఐకాన్ ప్రభుదేవాతో కలిసి మంచు విష్ణు ఒక భారీ వినోదాత్మక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నారు. ప్రభుదేవా మేకింగ్ మరియు కొరియోగ్రఫీ తోడుగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం పూర్తి స్థాయి డ్యాన్స్, యాక్షన్ మరియు మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.
Also read: ఓటీటీ ఆఫర్లు కూడా దక్కించుకోలేకపోతున్న టాలీవుడ్ హీరో... ఫ్యాన్స్ షాక్
అంతేకాకుండా, 1947 నాటి స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంతో కూడిన ఒక పీరియాడిక్ కథాంశంపై కూడా విష్ణు వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చారిత్రక కథను కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌గా విజువల్ గ్రాండియర్‌తో భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కన్నప్ప సాధించిన విజయం తర్వాత మంచు విష్ణు తన హోమ్ బ్యానర్ '24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ' ద్వారా కేవలం నటుడిగానే కాకుండా నిర్మాణం, కథా రచన రంగాల్లోనూ బిజీగా మారనున్నారు. ఒక్క కన్నప్పతోనే ఆగిపోకుండా, కామెడీ, మాస్ యాక్షన్ మరియు పీరియడ్ డ్రామా వంటి వైవిధ్యమైన జోనర్లలో వరుస సినిమాలు లైన్‌అప్‌లో పెడుతూ తన సినీ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నాడు.
Manchu Vishnu, Manchu Mohan Babu, Tollywood






