Home

»

Latest News

'జన నాయగన్' చూసిన విజయ్ భార్య సంగీత?.. వీడియో వైరల్.!

Jul 25, 2026 5:23PM

దళపతి విజయ్ తన సినీ ప్రయాణానికి ముగింపు పలుకుతూ నటించిన 'జన నాయగన్' సినిమా ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ హడావుడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే తాజాగా విజయ్ భార్య సంగీత గురించి నెట్టింట ఒక వార్త చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. చాలా కాలంగా విజయ్‌కు దూరంగా ఉంటున్న ఆయన భార్య సంగీత, 'జన నాయగన్' చూసేందుకు ఒక థియేటర్‌కు వచ్చిందనే ప్రచారం ఊపందుకుంది.

ఒక వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో ఈ ప్రచారం వ్యాపించింది. సంగీత సడన్‌గా థియేటర్‌లో ప్రత్యక్షమై సినిమా చూశారని, విజయ్ ఆఖరి సినిమాకు ఆమె గుట్టుచప్పుడు కాకుండా తన మద్దతు తెలిపారని, వారిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయి మళ్లీ కలిసే అవకాశాలు ఉన్నాయంటూ అభిమానులు, నెటిజన్లు రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. దళపతి అభిమానులు కూడా ఈ వార్త చూసి నిజమేనేమో అని నమ్మి సోషల్ మీడియాలో ఆ వీడియోను భారీగా షేర్ చేయడం ప్రారంభించారు. 

అయితే, సంగీత 'జన నాయగన్' థియేటర్‌కు వచ్చిందనే వార్త పూర్తిగా అబద్ధం అని తేలింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో 'జన నాయగన్' సినిమా స్క్రీనింగ్‌కు సంబంధించినది కానే కాదు. అది 2023లో శివకార్తికేయన్ నటించిన 'మావీరన్' సినిమా ప్రీమియర్ కు సంగీత హాజరైనప్పటి పాత వీడియో క్లిప్. 

విజయ్ చివరి సినిమా కావడంతో, అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొందరు నెటిజన్లు ఆ పాత వీడియోను రీ-అప్‌లోడ్ చేసి, రీసెంట్ వీడియోగా ప్రచారం చేశారు. 

 

 

Thalapathy Vijay, Jana Nayagan, Vijay wife Sangeetha, Viral Video

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com