
‘కచ్చి సేరా’తో ఒక్కసారిగా సౌత్ ఇండియాలో సెన్సేషన్‌గా మారిన మ్యూజిక్ కంపోజర్ సాయి అభ్యంకర్.. ఆ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్టులు సైన్ చేస్తూ దూసుకెళ్తున్నారు. సూర్య ‘కరుప్పు’ నుంచి అల్లు అర్జున్-అట్లీ ‘రాకా’ వరకు వరుస ఆఫర్లు అందుకున్నారు. అయితే ఇంత క్రేజ్ వచ్చినా.. సాయి అభ్యంకర్ ఇప్పటివరకు తెలుగులో మరో సినిమా ఎందుకు సైన్ చేయలేదనే ప్రశ్న చాలామందిలో ఉంది.
దీనికి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కారణం సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’తోనే సాయి అభ్యంకర్ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా కంటే ముందుగా విడుదలయ్యే మరో తెలుగు సినిమాకు ఆయన మ్యూజిక్ చేయకుండా ఒప్పందంలో ఓ క్లాజ్ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. అంటే ‘రాకా’ రిలీజ్ అయ్యే వరకు మరో తెలుగు ప్రాజెక్ట్‌ను సాయి చేయకూడదనే కండిషన్ ఉందన్నమాట.

2024లో ‘కచ్చి సేరా’తో భారీ పాపులారిటీ సంపాదించిన సాయి కెరీర్.. ఆ తర్వాత ‘ఆస కుడా’, ‘సితిర పుతిరి’, ‘విజి వీకురా’, ‘పవళ మల్లి’ వంటి ఇండిపెండెంట్ సాంగ్స్‌తో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఆయన పాటలు వందల మిలియన్ల వ్యూస్ సాధించడంతో చాలా తక్కువ సమయంలోనే మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. మలయాళంలో ‘బాల్టీ’, తమిళంలో ‘డ్యూడ్’తో ఆయన ఫిల్మ్ కంపోజర్‌గా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సూర్య నటించిన ‘కరుప్పు’, ‘రాకా’తో పాటు పలు క్రేజీ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: 'ఉరికే చిలకా' పాట అసలైన అర్ధం తెలిస్తే కన్నీళ్ళు ఆగవు.!
[Sai Abhyankkar Telugu Debut, Sai Abhyankkar Telugu Movies, Sai Abhyankkar Songs, Raaka Movie, Allu Arjun Atlee Movie, Allu Arjun, Director Atlee, Telugu Film News, Telugu News]





