Home

»

Latest News

ఆర్జీవీ హీరోయిన్ అనైకా సోటి వివాహం.. వరుడు ఎవరంటే?

Sep 28, 2026 2:41PM

ఆర్జీవీ హీరోయిన్ అనైకా సోటి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియాలో ‘టెడ్ ది స్టోనర్’గా గుర్తింపు తెచ్చుకున్న జితేంద్ర శర్మను ఆమె వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా తమ బంధాన్ని పెళ్లితో మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి.

తమ ప్రేమ ప్రయాణం గురించి అనైకా సోటి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ముందుగా స్నేహితులుగా మొదలైన తమ పరిచయం ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిందని, క్రమంగా ప్రేమలో పడ్డామని ఆమె తెలిపారు. దాదాపు ఆరేళ్లుగా కలిసి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, సంతోషాలు, త్యాగాలు, ప్రేమను పంచుకున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు తమ బంధాన్ని శాశ్వతంగా మార్చుకున్నామని చెప్పడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇక అనైకా సోటి సినీ కెరీర్ విషయానికి వస్తే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య 2’ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన గ్లామర్‌తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఆర్జీవీ దర్శకత్వంలోనే ‘365 డేస్’ చిత్రంలో నటించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో అవకాశాలు దక్కలేదు.

కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనైకా.. ఇప్పుడు పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించారు. జితేంద్ర శర్మతో కలిసి దిగిన వెడ్డింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా నూతన దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

[Anaika Soti Marriage, Anaika Soti Wedding, Anaika Soti Husband, Jitendra Sharma, Ted The Stoner, Anaika Soti Wedding Photos, RGV Heroine Marriage, Satya 2 Actress Anaika Soti]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com