
నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమాపై వచ్చిన స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, కొన్ని సన్నివేశాల ట్రీట్‌మెంట్‌పై విమర్శలు రావడంతో సినిమా చుట్టూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ ఫీడ్‌బ్యాక్‌ను నాని సీరియస్‌గా తీసుకున్నాడని, ఇప్పుడు ఓటీటీ వెర్షన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడని టాక్ వినిపిస్తోంది.
థియేట్రికల్ వెర్షన్‌కు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీలో విడుదలయ్యే వెర్షన్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే పనిలో నాని ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రేక్షకులు విమర్శించిన అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, ట్రోలింగ్‌కు అవకాశం తగ్గించేలా మార్పులు చేయాలని చూస్తున్నారట.
అంతేకాదు.. థియేటర్లలో చూపించని ఓ పాటతో పాటు మరికొన్ని సన్నివేశాలు, మూమెంట్స్‌ను కూడా ఓటీటీ వెర్షన్‌లో జోడించనున్నట్లు సమాచారం. దీంతో థియేటర్లలో చూసిన వారికి కూడా డిజిటల్ వెర్షన్‌లో కొన్ని కొత్త సన్నివేశాలు చూసే అవకాశం ఉండొచ్చు.
సాధారణంగా సినిమా నిడివి, కథనం వేగం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని థియేట్రికల్ వెర్షన్‌లో కొన్ని సన్నివేశాలను తొలగిస్తుంటారు. అయితే ఓటీటీ విడుదల సమయంలో అదనపు సన్నివేశాలు జోడించడం ద్వారా కథకు మరింత స్పష్టత ఇవ్వొచ్చు. ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే తరహా ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది.
సినిమా విడుదలైన తర్వాత విమర్శలు రావడం సహజమే. కానీ వాటిలో ప్రేక్షకులు పదేపదే ప్రస్తావించిన అంశాలను గుర్తించి, తదుపరి వెర్షన్‌ను మెరుగుపరచాలని ప్రయత్నించడం ఆసక్తికరమైన విషయం. ‘ది ప్యారడైజ్’ ఓటీటీ వెర్షన్ విషయంలో నాని నిజంగానే మార్పులు చేయిస్తే.. థియేటర్లలో వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది.
మరి ఓటీటీ వెర్షన్‌లో కొత్త పాట, అదనపు సన్నివేశాలు సినిమాకు ప్లస్ అవుతాయా? థియేటర్లలో వచ్చిన నెగెటివ్ టాక్‌ను నాని తగ్గించగలడా? అనేది డిజిటల్ రిలీజ్ తర్వాతే తేలనుంది.
ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ్.. హిందీలో సంచలనం.. తెలుగులో పరిస్థితి ఏంటి.!
[The Paradise OTT Version, Nani The Paradise, Nani Paradise Movie, Paradise OTT, The Paradise Movie, Natural Star Nani, Srikanth Odela, Telugu Film News]




