Home

»

Latest News

విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్.. కనకదుర్గమ్మ దర్శనానికి రాబోతున్న దళపతి?

Oct 9, 2026 7:27PM

సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దళపతి విజయ్.. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు రానున్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకోవడంతో పాటు, నగరంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలోనూ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ రాకపై తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

విజయవాడలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవాలని విజయ్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు జరగనున్నాయి. ఈ సమయంలో విజయ్ ఏ రోజు వస్తారు? అమ్మవారిని ఏ అలంకారంలో దర్శించుకుంటారు? అనే వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెల్లడైతే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

అదే రోజు కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్‌లో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలోనూ విజయ్ పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ఉత్సవాల ద్వారా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను మరింత విస్తృతంగా పరిచయం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానాలు అందించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో విజయ్ హాజరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. 

సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్‌కు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇప్పుడు విజయవాడకు వస్తారనే వార్తతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ పర్యటన ఖరారైతే కనకదుర్గమ్మ దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ్‌లో విజయ్ పాల్గొనడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అయితే ఆయన పర్యటనపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

 

 

[Tamil Nadu CM Vijay, Vijay Vijayawada Visit, Vijay Kanaka Durga Temple, Vijayawada Dasara Celebrations 2026, Vijayawada Utsav 2026, Thalapathy Vijay Latest News, Vijay Indrakeeladri Visit]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com