
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. ‘దసరా’ తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండటంతో సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. ముఖ్యంగా అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అయితే థియేటర్లలో ప్రేక్షకులు మిస్సయిన ఓ పాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో ఓ కీలక సందర్భంలో పెట్టాల్సిన పవర్‌ఫుల్ సాంగ్‌ను చివరి నిమిషంలో పక్కన పెట్టాల్సి వచ్చిందట. ఇప్పుడు అదే పాటను ఓటీటీ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.
లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల ఈ విషయాన్ని చెప్పారు. ‘దేశం’ కాన్సెప్ట్‌తో సాగే ఆ పాట థియేటర్లలో పడితే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేదని ఆయన తెలిపారు.
అయితే రిలీజ్‌కు ముందు ఆ పాటను పూర్తిచేయడానికి సమయం సరిపోలేదట. అదే సమయంలో అనిరుధ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై బిజీగా ఉన్నారు. ఆ పాటకు లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో రికార్డింగ్ చేయడంతో పాటు ఫైనల్ మిక్సింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో చివరికి దాన్ని థియేట్రికల్ వెర్షన్ నుంచి తప్పించాల్సి వచ్చిందని శ్రీకాంత్ చెప్పారు.
అయితే ఇప్పుడు ఆ పాటను పూర్తిగా వదిలేయడం లేదు. అనిరుధ్‌తో మళ్లీ రికార్డింగ్ చేయించి, పూర్తి వెర్షన్‌ను సిద్ధం చేసి నెట్‌ఫ్లిక్స్ వెర్షన్‌లో జోడించే ఆలోచనలో ఉన్నట్టు శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు.

ప్రస్తుతం థియేటర్లలోని ఒక కీలక సన్నివేశంలో ఇంగ్లిష్ ట్రాక్ వినిపిస్తుంది. దాని స్థానంలో ఈ కొత్త తెలుగు పాటను పెట్టే ఆలోచన జరుగుతున్నట్టు సమాచారం. అదే జరిగితే థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ప్యారడైజ్’ కొంత భిన్నంగా కనిపించనుంది.
ఇప్పటికే ‘ది ప్యారడైజ్’కు నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ పార్ట్‌నర్‌గా ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో రన్ అవుతుండటంతో ఆ తర్వాతే డిజిటల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: చుట్టమల్లే AI వీడియో వివాదం.. రంగంలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్.!
[The Paradise OTT Version, The Paradise Desam Song, The Paradise Songs, Paradise Movie Songs, Natural Star Nani, Srikanth Odela, Anirudh Ravichander, Telugu Film News]






