
'సిగ్మా'తో జాసన్ సంజయ్ దర్శకుడిగా నిరూపించుకున్నాడు. అద్భుతమైన టేకింగ్ తో పస లేని సీన్ ని సైతం ఒక రేంజ్ లో తీర్చిదిద్దాడు. కాకపోతే గతంలో సిగ్మా లాంటి కథతో కూడిన ఎన్నో చిత్రాలని ప్రేక్షకులని చూసి ఉండటంతో సిగ్మా పరాజయాన్ని చాలా గట్టిగా కౌగిలించుకుంది. కనీసం రివర్స్ స్క్రీన్ ప్లే లో అయినా కథని చెప్పుండాల్సిందనే మాటలు సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు
సందీప్ కిషన్ ఈసారి తమిళ పరిశ్రమలోని ఒక బడా స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగు అగ్ర హీరో అనే రూమర్స్ సైతం వినిపిస్తున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సంజయ్ ఇప్పటికే ఒక పవర్‌ఫుల్ మాస్ అండ్ ఎమోషనల్ కథని సిద్ధం చేసుకున్నారట. ఈ స్క్రిప్ట్ లైన్ విన్న ఒక అగ్ర హీరో ప్రాజెక్ట్ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, తన తండ్రి స్టార్‌డమ్‌ను గానీ, రాజకీయాధికారాన్ని గానీ వాడుకోకుండా సొంతంగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో జేసన్ సంజయ్ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సిగ్మా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో కూడా తన తండ్రి విజయ్ పాల్గొనకపోవడం, తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉండాలన్న జేసన్ సంజయ్ ఆలోచనని స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: విదేశీ రియాలిటీ షో హోస్ట్ గా మాధవన్! ఆ 'షో' ఎలా జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు

ఏది ఏమైనా తన మొదటి సినిమా ద్వారా దర్శకుడిగా సెట్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్న సంజయ్, రెండో సినిమాని మరింత పక్కా ప్రణాళికతో తెరకెక్కించాలనుకుంటున్నాడు . త్వరలోనే ఈ బడా హీరో ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. మరి రెండో సినిమాతో అయినా కథ, కథనం యొక్క గొప్పతనం తెలుసుకొని సంజయ్ జాగ్రత్త పడతాడేమో చూడాలి.
[Jason Sanjay Next Movie With Big Hero, Jason Sanjay, Vijay son Jason Sanjay, Sigma movie, Sundeep Kishan, Jason Sanjay next movie,Telugu Cinema News, Telugu cinema, Tollywood News, Tollywood]
.webp)






