
AI టెక్నాలజీ వచ్చాక ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో దీన్ని దుర్వినియోగం చేసే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను కొందరు AIతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వీడియోను తయారు చేసిన వారిపై, ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ కూడా ఇదే అంశంపై స్పందించారు. ఆ AI మార్ఫింగ్ వీడియో చాలా డీఫేమింగ్‌గా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలను ఇకపై చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని నాగవంశీ తెలిపారు. కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యగా కాకుండా.. రేపు ఎవరినైనా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ భావిస్తోందని చెప్పారు.
అంతేకాదు.. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామని నాగవంశీ వెల్లడించారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఈ వ్యవహారంపై టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. చిరంజీవి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఈ విషయంలో ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. AI దుర్వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇక నాగవంశీ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలన్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? AI డీప్‌ఫేక్‌లపై భవిష్యత్తులో ఎలాంటి కఠిన నిబంధనలు వస్తాయి? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: అంత సీన్ లేదు.. ఫేక్ రికార్డులపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.!
[Chuttamalle AI Morphed Video, Aadarsha Kutumbam Press Meet, Chuttamalle AI Video, Naga Vamsi Press Meet, Jr NTR AI Video, Janhvi Kapoor AI Video, Chuttamalle Controversy, AI Deepfake Controversy, Pawan Kalyan, Telugu Film News]






