
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర మరో కీలక మైలురాయిని అందుకుంది. రిలీజ్‌కు ముందు నుంచే నైజాం ఏరియాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసిన ఈ సినిమా.. విడుదల తర్వాత కూడా అదే జోరు కొనసాగించినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమా వసూళ్లు రూ.50 కోట్ల మార్క్‌ను దాటాయి. దీంతో నాని కెరీర్‌లో నైజాంలో అత్యధికంగా వసూలు చేసిన సినిమాగా ‘ది ప్యారడైజ్’ కొత్త రికార్డు సెట్ చేసింది.
‘ది ప్యారడైజ్’కు నైజాం మార్కెట్‌లో మొదటి నుంచే భారీ డిమాండ్ కనిపించింది. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే నైజాం నుంచి రూ.14 కోట్లకు పైగా గ్రాస్ నమోదైనట్లు అప్పటి ట్రేడ్ రిపోర్టులు వెల్లడించాయి. హైదరాబాద్ వాటానే ఇందులో రూ.11 కోట్లకు పైగా ఉండటం విశేషం.
అయితే సినిమా విడుదలైన తర్వాత కంటెంట్‌పై మిక్స్‌డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం నానికి కెరీర్ బెస్ట్‌గా నమోదయ్యాయి. ముఖ్యంగా నైజాం మార్కెట్‌లో వచ్చిన నంబర్స్ మాత్రం నాని మార్కెట్‌ను మరోసారి చూపిస్తున్నాయి. ‘దసరా’తో నైజాం మార్కెట్‌లో తన సత్తా చూపించిన నాని.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరో అడుగు ముందుకేసినట్టైంది. మరి.. ఈ జోరు కొనసాగించి ‘ది ప్యారడైజ్’ నైజాంలో ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: అప్పుడు దేవర.. ఇప్పుడు ప్యారడైజ్.!

[The Paradise Nizam Collections, The Paradise Nizam 50 Crores, The Paradise Box Office, The Paradise Collections, Nani Nizam Record, The Paradise Movie, Nani Paradise Movie, Tollywood Box Office, Telugu Film News]






