Home

»

Latest News

బ్లడీ రోమియో: నానితో ఆ క్రేజీ హీరోయిన్ రొమాన్స్.!

Sep 29, 2026 11:55AM

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న 'బ్లడీ రోమియో' ప్రాజెక్ట్ గురించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 'లక్కీ భాస్కర్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'అనగనగా ఒక రాజు' వంటి హిట్స్ తో గోల్డెన్ లెగ్‌గా మారిన మీనాక్షి.. మొదటిసారి నానితో జతకట్టనుంది. 

ఈ సినిమాలో ఇంకో సర్ ప్రైజ్ కూడా ఉంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నారు. నాని, పృథ్వీరాజ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ థియేటర్లలో నెక్స్ట్ లెవల్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఇక 'బ్లడీ రోమియో' కంటెంట్ విషయానికి వస్తే.. సుజీత్ తన మార్క్ స్టైలిష్ విజువల్స్, డార్క్ హ్యూమర్‌తో ఈ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను రూపుదిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్, అలాగే నాని ప్రొడక్షన్ హౌస్ అయిన యునానిమస్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మూడో వారం నుంచి గ్రాండ్‌గా షురూ కానుంది. ముందుగా హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరిస్తారు. ఆ తర్వాత వెంటనే చిత్రబృందం భారీ షెడ్యూల్ కోసం లండన్ ఫ్లైట్ ఎక్కబోతోంది. అక్కడ తీయబోయే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకే మెయిన్ హైలైట్‌గా నిలవనున్నాయి.

నానిని ఒక కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్‌లో, మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో ప్రెసెంట్ చేసేందుకు సుజీత్ పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు. మరి ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాతో నాని ఎలాంటి సంచనాలు సృష్టిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: నైజాంలో 50 కోట్లు.. ‘ప్యారడైజ్’తో నాని ఆల్ టైమ్ రికార్డ్.!

 

 

 

[Meenakshi Chaudhary to Romance Nani, Meenakshi Chaudhary in Bloody Romeo, Meenakshi Chaudhary Nani, Bloody Romeo Movie Update, Nani Bloody Romeo, Nani Next Movie, Bloody Romeo Shooting Update, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com