Home

»

Latest News

నానికి తమన్నా షాక్: ది ప్యారడైజ్ కంటే ఆ సినిమాకే క్రేజ్ ఎక్కువ!

Sep 29, 2026 10:49AM


తమన్నా ఇప్పుడు నాచురల్ స్టార్ నాని ప్యారడైజ్ ని ఉద్దేశిస్తూ  'నీలాల నింగి కోనల్లో ఉయ్యాలా, నీ కోసం వచ్ఛానయ్యో, బాక్స్ ఆఫీస్ ని దోచానయ్యో' అని పాడుకుంటూ ఉంది   తమన్నా హీరోయిన్ గా చేసిన బాలీవుడ్ మూవీ 'ది వ్వాన్' అనూహ్యంగా సోమవారం అడ్వాన్స్ బుకింగ్స్‌లో విపరీతమైన ఆదరణ సాధించి ప్యారడైజ్ ని  అధిగమించింది. హిందీ బెల్ట్‌తో పాటు పలు ప్రధాన నగరాల బుకింగ్స్ ట్రెండ్స్ పరిశీలిస్తే, 'ది వ్వాన్' సినిమా వైపే ఎక్కువ మంది ప్రేక్షకులు మొగ్గు చూపడం సినీ విశ్లేషకులని  సైతం ఆశ్చర్యపరుస్తుంది.

సాధారణంగా సౌత్ నుంచి వచ్చే భారీ యాక్షన్ సినిమాలకు ఉత్తరాదిలోనూ, నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్‌లోనూ మొదటి సోమవారం మంచి హోల్డ్ ఉంటుంది. కానీ ఈసారి క్ట్ 'ది వ్వాన్' సాధిస్తున్న బుకింగ్ నంబర్లు ట్రేడ్ వర్గాలను విస్తుపోయేలా చేస్తున్నాయి. శని, ఆదివారాల్లో హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ దండయాత్ర చేసిన 'ది ప్యారడైజ్' సినిమా సోమవారం ఉదయం నాటికి అడ్వాన్స్ ట్రెండ్స్‌లో కాస్త  స్లో అయ్యింది. దీనికి భిన్నంగా తమన్నా చిత్రం 'ది వ్వాన్' సరికొత్త రికార్డులతో సోమవారం బుకింగ్స్‌లో టాప్ లీడ్‌లో నిలవడం బాలీవుడ్ బాక్సాఫీస్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.


ఇది కూడా చదవండి: ఎందుకు మీకు అంత అసూయ: బరాబర్ ఇంకా ఎదుగుతాం!

 

ఈ రెండు సినిమాల మధ్య నడుస్తున్న సోమవారం బాక్సాఫీస్ రేసు ప్రస్తుతం సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాని 'ది ప్యారడైజ్' తన సాలిడ్ మాస్ అప్పీల్‌తో గ్రామీణ, సింగిల్ స్క్రీన్ ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, తమన్నా 'ది వ్వాన్' అర్బన్ సెంటర్లు, మల్టీప్లెక్స్‌లలో సోమవారం అత్యధిక శాతంలో సీట్లు ఫిల్ చేసి దూసుకుపోతోంది. సోమవారం సాయంత్రం నాటికి తుది ఆక్యుపెన్సీ నంబర్లు వచ్చేసరికి ఈ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారు, ఈ ట్రెండ్ మిగతా వారమంతా ఎలా కొనసాగుతుందో చూడటం నిజంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తమన్నా తెలుగింటి ఆడపడుచు హోదాలో స్టార్ గా ఉంది కాబట్టి.

 

[Nani Paradise vs Tamannaah vvaan Monday Bookings, Nani The Paradise, The Paradise Box Office Collection, vvaan Collections, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com