Home

»

Latest News

The Paradise: 11 రోజుల కలెక్షన్ల ఊచకోత! ఎవరక్కడ! 

Oct 5, 2026 3:46PM


ది ప్యారడైజ్ కి మంచి ఆదరణ లభిస్తుందని రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని మేడారం  లోని 'సమ్మక్క, సారక్క', విజయవాడ 'కనకదుర్గమ్మ'ని దర్శించుకొని మొక్కులు చెల్లించిన విషయం తెలిసిందే. 

 ప్యారడైజ్ సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే  సెప్టెంబర్ 23న  ప్రీమియర్స్ తో అడుగుపెట్టిన ప్యారడైజ్ ప్రపంచవ్యాప్తంగా  167.39 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటేసింది.  అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే 11.60 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి, 900 షోలలో ఏకంగా 79.0% ఆక్యుపెన్సీ నమోదు చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఓపెనింగ్ డే రోజున 9,732 షోలతో 49.3% ఆక్యుపెన్సీ అందుకోవడం నాని మాస్ స్టామినాకు నిదర్శనం. తొలి రోజు వచ్చిన ఊపుతో మొదటి వీకెండ్‌లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. శుక్రవారం 14.90 కోట్లు, శనివారం 15.25 కోట్లు, అలాగే ఆదివారం రోజున 15.70 కోట్ల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ సృష్టించింది. మొదటి వారంలోనే ఏకంగా 108.20 కోట్ల ఇండియా నెట్ వసూళ్లను సాధించి శభాష్ అనిపించుకుంది. తొలి 10 రోజుల్లోనే భారతదేశం వ్యాప్తంగా 115.56 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా, ఇండియా గ్రాస్ 136.44 కోట్లకు చేరుకుంది. ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు భారీ ఆదరణ లభించింది. 

 

ఇది కూడా చదవండి: చిరంజీవి, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన మూవీ ఇదే.. హిట్ అనే సంగతి కూడా తెలుసా!

ఓవర్సీస్ మార్కెట్ నుండి అత్యధికంగా 30.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించడంతో, ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఏకంగా  167.39 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటేసింది.   అయితే, ఈ సినిమా టాక్‌పై ప్రేక్షకుల నుండి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా మేకింగ్, నాని పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌ను మెచ్చుకుంటూనే కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. దీనిపై నాని ఎంతో సహజంగా స్పందిస్తూ, "మీ ప్రేమాభిమానాలను ఎంతగా స్వీకరించానో, మీ మీమ్స్, ట్రోల్స్‌ని  కూడా అంతే సరదాగా ఆస్వాదించాను" అంటూ ఫ్యాన్స్ హృదయాలని గెలుచుకున్నారు. మరి 200 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే సౌండ్ స్లో గానే ఉంది.

 

[The Paradise Collections, Kayadu Lohar, Nani About the Paradise collections, The Paradise Box Office Collection, Nani The Paradise Collections, The Paradise Day Wise Collection.Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com