
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా.. అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో మూవీ పోస్ట్ పోన్ అయినట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదాను అధికారికంగా ప్రకటించారు.
నాగవంశీ మాట్లాడుతూ.. "మూడు నాలుగు రోజుల క్రితం కూడా అక్టోబర్ 9నే సినిమా విడుదలవుతుందని మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాం. అందుకే నేను పోస్ట్ పోన్ అవ్వదని ట్వీట్ చేశాను. ఓవర్సీస్ లో బుకింగ్స్ కూడా ఓపెన్ చేయించాము. కానీ, నిన్న ఉదయానికి కూడా ఓవర్సీస్ సెన్సార్ కి కంటెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పరంగా మూడు నాలుగు రోజులు వెనకబడిపోయాము. ఈ పరిస్థితుల్లో కంగారుగా సినిమాను విడుదల చేసేకంటే.. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని, క్వాలిటీ అవుట్ పుట్ తో మీ ముందుకు రావాలనే ఉద్దేశంతోనే ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నాము. పైగా, ప్రమోషనల్ కార్యక్రమాలకు కూడా సమయం లేకుండా పోయింది. రెండు మూడు వారాల తర్వాత సరైన తేదీ చూసుకొని, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాము. మిగతా పాటలను, ట్రైలర్ ను విడుదల చేసి రాబోయే రెండు మూడు వారాల పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి.. వీలైనంత త్వరగా మీ ముందుకు వస్తాము. ‘ఆదర్శ కుటుంబం’ కాస్త ఆలస్యంగా వచ్చినా..వెంకటేష్ గారి అభిమానులంతా నూటికి నూరు శాతం సంతృప్తి చెందేలా సినిమా ఉంటుంది." అన్నారు.
ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ ఆకట్టుకుంది. త్వరలోనే మిగతా పాటలను, ట్రైలర్ ను విడుదల చేయడంతో పాటు.. కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: బోయపాటి బిగ్ అనౌన్స్‌మెంట్.. త్వరలో 'అఖండ 3'.. చిరంజీవి, బాలయ్యతో మల్టీస్టారర్.!
[Aadarsha Kutumbam Postponed, Naga Vamsi Press Meet, Aadarsha Kutumbam Movie, Producer Naga Vamsi, Victory Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Nara Rohith, Telugu Film News]





