Home

»

Latest News

చిరంజీవి, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన మూవీ ఇదే.. హిట్ అనే సంగతి కూడా తెలుసా!

Oct 5, 2026 3:13PM

మెగాస్టార్ చిరంజీవి.. సింగీతం శ్రీనివాసరావు.. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమా ఎంత పెద్ద ఘనవిజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.  ఇండియన్ సినిమా రికార్డులు మొత్తం బద్దలయిపోయాయి కదా! ఏంటి మాకు తెలియకుండా  ఎప్పుడు వచ్చిందని అనుకుంటున్నారా! రాలేదులే. ఆ ఇద్దరు లెజండ్రిస్ కాంబోలో వచ్చిన  సినిమా ఎన్ని  రికార్డులని బద్దలు కొట్టేదో అని సైట్ కూడా అనుకుంటూ ఉంటుంది కదా! అందుకే తన భావాన్ని ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. కాకపోతే ఆ ఇద్దరి కాంబోలో రావాల్సిన మూవీ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది.


 సరిగ్గా 1996వ సంవత్సరంలో వైజయంతీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. అశ్వినీ దత్ నిర్మాణంలో, చిరంజీవి కథానాయకుడిగా 'భూలోకవీరుడు' అనే సోషియో ఫాంటసీ మూవీ చాలా వైభవంగా ప్రారంభమైంది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరంజీవి, అశ్వినీ దత్  సోషియో ఫాంటసీ కాంబో కావడంతో అప్పట్లో సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు.ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా టబుని ఎంపిక చేశారు. ప్రముఖ సీనియర్ రచయిత సత్యానంద్ వినూత్నమైన ఫాంటసీ కథని  అందించగా, సింగీతం శ్రీనివాసరావు గారు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూర్చారు.సంగీత బ్రహ్మ ఇళయరాజా మ్యూజిక్. 'భూలోకవీరుడు' షూటింగ్ వేగంగా మొదలైంది. చిరంజీవి, టబులపై ఆకర్షణీయమైన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా ఆ రోజుల్లోనే అధికారికంగా విడుదల చేశారు. ప్రణాళిక ప్రకారం 2 ప్రధాన షూటింగ్ షెడ్యూళ్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ రెండు షెడ్యూళ్ల వ్యవధిలో కథకు సంబంధించిన కొన్ని అత్యంత కీలక సన్నివేశాలతో పాటు, ఇళయరాజా స్వరపరిచిన 2 ప్రత్యేకమైన పాటల చిత్రీకరణను కూడా సింగీతం గారు అద్భుతంగా పూర్తి చేయడం విశేషం.

అయితే అంతా సజావుగా సాగుతున్న తరుణంలో అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. 1990ల కాలంలో సోషియో ఫాంటసీ చిత్రాలకు అవసరమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX), గ్రాఫిక్స్ సాంకేతికత భారతదేశంలో చాలా పరిమితంగా ఉండేది. భారీ విజువల్స్ తీసుకురావడానికి అనుకున్న బడ్జెట్ అంచనాలు పరిమితికి మించి పెరగడం, దాంతో పాటు కథా విస్తరణలో పూర్తిస్థాయి బలం కనిపించకపోవడంతో మేకర్స్ ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ఫలితంగా రెండు షెడ్యూళ్లు పూర్తయిన తర్వాత 'భూలోకవీరుడు' ప్రాజెక్ట్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఒకవేళ ఈ సినిమా పూర్తిస్థాయిలో వచ్చి ఉంటే తెలుగు చిత్రసీమలో మరొక అపూర్వమైన క్లాసిక్ సోషియో ఫాంటసీగా నిలిచిపోయేదని సినీ విశ్లేషకులు ఇప్పటికీ భావిస్తుంటారు.

 

 


ఇది కూడా చదవండి: స్పిరిట్ లో ప్రభాస్ క్యారక్టర్ లక్షణం ఇదే: ఇదేం షాక్ భయ్యా!

విశేషమేమిటంటే, సినిమా ఆగిపోయినప్పటికీ అందుకోసం చేసిన కసరత్తులు, స్వరాలు వృథాగా పోలేదు. ఇళయరాజా కంపోజ్ చేసిన ఆ 2 అద్భుతమైన పాటలను తర్వాతి రోజుల్లో చిత్రబృందం ప్రత్యేకంగా విడుదల చేసింది. ఆ తర్వాత వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై చిరంజీవి హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ 'చూడాలని ఉంది' థియేటర్లలో 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న సందర్భంలో, అభిమానుల కోసం థియేటర్లలో 'భూలోకవీరుడు' చిత్రంలోని పాటలను జత చేసి ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. ప్రస్తుతం ఆ పాటలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉండి అభిమానులు, సినీ ప్రియులని  అలరిస్తున్నాయి.

 

[Chiranjeevi And Singeetham Srinivasarao Bhuloka Veerudu Untold Story, Chiranjeevi Bhuloka Veerudu, Singeetham Srinivasa Rao, Chiranjeevi Shelved Movies, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com