
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సికింద్రాబాద్ స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. దానిని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో రోజు బుకింగ్స్ చూస్తుంటే ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి.
బుక్‌మైషోలో సెకండ్ డే బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. కేవలం చివరి ఒకే ఒక్క గంట వ్యవధిలోనే ఏకంగా 17.16K పైగా టికెట్లు బుక్ అయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ 'A' రేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామాకి, నెగటివిటీని తట్టుకొని రెండో రోజు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ ఉండటం మామూలు విషయం కాదు.
బుక్‌మైషోలో, డిస్ట్రిక్ట్ యాప్స్ లో ఓవరాల్ గా ఇప్పటివరకు 2.5 మిలియన్ టికెట్లు బుక్ అయ్యాయి. శని, ఆదివారాల్లో బుకింగ్స్ మరింత జోరు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఫస్ట్ వీకెండ్ లోనే ఈ మూవీ రూ.150 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉంది. నెగటివ్ టాక్ తో ఈ రేంజ్ లో కలెక్షన్స్ నిజంగా అద్భుతం.
ఇది కూడా చదవండి: ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఓ లుక్ వేయాల్సిందే.!

[The Paradise Book My Show Trend, The Paradise Day 2 Bookings, The Paradise Movie, Nani Paradise, Natural Star Nani, Srikanth Odela, Telugu Film News, Telugu News]






