
ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన ప్రాజెక్టుల్లో 'ఆదర్శ కుటుంబం (House No: 47)' ఒకటి. సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు , ప్రేక్షకులు తమ మెదళ్ళకి పదును కూడా పెట్టబోతున్నారు. అదే టైంలో తమ అంచనాలకి తగట్టుగా ఉంటుందా లేదా అనే టెన్షన్ కూడా వాళ్ళందరిలో ఉంది. ఎందుకంటే విక్టరీ వెంకటేష్, మాటతో పాటు సెల్యులాయిడ్ మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రచనా రూపంలో వచ్చిన సినిమాలే అందుకు కారణం. అక్టోబర్ 9 రిలీజ్ డేట్ కావడంతో ఇప్పుడు త్రివిక్రమ్ లో టెన్షన్ మొదలైనట్టుగా తెలుస్తుంది.
అనుకున్న సమయానికి AK ని సిద్ధం చేసేందుకు ఒకే రోజు మూడు విభిన్న లొకేషన్లలో చిత్రీకరణ నిర్వహించేలా ప్లాన్ చేయడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సినిమాలోని అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన సన్నివేశాల చిత్రీకరణని ఈ లొకేషన్లలో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కథలోని ప్రధాన ట్విస్టులలో ఒకటైన వెంకటేష్ కొడుకు కిడ్నాప్ సన్నివేశాలను చిత్రబృందం ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసింది. ఈ హై-వోల్టేజ్ డ్రామా, ఎమోషనల్ సీన్లను ఇన్ఆర్బిట్ మాల్ (Inorbit Mall) లాంటి రద్దీ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా చిత్రీకరిస్తున్నారు. పబ్లిక్ లోకేషన్‌లో అంతటి భావోద్వేగపూరితమైన, ఉత్కంఠ కలిగించే సీన్లను అనుకున్న అవుట్‌పుట్ వచ్చేలా తీయడం త్రివిక్రమ్‌కు ఒక పెద్ద సవాలుగా మారింది. ఏమాత్రం పొరపాటు జరగకుండా 100% పర్ఫెక్షన్ సాధించడానికి యూనిట్ మొత్తం ఈ రోజు ఉదయం నుంచి శ్రమిస్తోంది.

కేవలం షాపింగ్ మాల్ లోకేషన్ మాత్రమే కాకుండా, మిగిలిన రెండు బ్యాలెన్స్ సీన్ల కోసం హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలను వినియోగిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) లో రూపొందించిన ప్రత్యేకమైన ఇండోర్ సెట్‌లో కుటుంబ సన్నివేశాలను, అలాగే రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Studios) లో యాక్షన్ అండ్ సస్పెన్స్ పార్ట్‌ను సమాంతరంగా షూట్ చేస్తున్నారు. 3 విభిన్న లొకేషన్ల మధ్య ఆర్టిస్టుల కాల్ షీట్లు సర్దుబాటు చేయడం, లైటింగ్ అండ్ సెటప్స్ సమకూర్చడం, షెడ్యూల్స్ మిస్ కాకుండా చూసుకోవడం వంటి అంశాలు పర్యవేక్షించాల్సి రావడంతో దర్శకుడు త్రివిక్రమ్ పూర్తి టెన్షన్‌లో మునిగిపోయినట్టుగా టాక్. ఇలా ఒకవైపు షూటింగ్ పనులు శరవేగంగా సాగుతుండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ కూడా సిద్ధమవుతున్నాయి. ఎంత టెన్షన్ ఉన్నా, క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఏది ఏమైనా త్రివిక్రమ్ తో పాటు మేకర్స్ ఎంత టెన్షన్ లో ఉన్నా ఫలితం మాత్రం థియేటర్స్ లో ప్రేక్షకుల నవ్వులు.
Adarsha Kutumbam Movie Shooting Update, Ak47, ak 47 shooting update, Venkatesh, Trivikram, Srinidhi Shetty, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollwyood News






