
30 ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి.. ఏకంగా 8,000 సంవత్సరాలుగా బతుకుతున్న ఒక మిస్టరీ మ్యాన్‌ను ట్రైన్‌లో కలిస్తే ఎలా ఉంటుంది?. ఇలాంటి ఆసక్తికర పాయింట్ తో ఓ సినిమా రాబోతోంది.
'బెత్లెహెం కుటుంబ యూనిట్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత, మలయాళ స్టార్ నివిన్ పౌలీ మైండ్ బ్లోయింగ్ కన్సెప్ట్‌తో రాబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రామ్ దర్శకత్వంలో.. నివిన్ పౌలీ, అంజలి, సూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సరికొత్త చిత్రమే 'సంచారి' (సప్తగిరులు.. సప్తసాగరాలు). సురేష్ కామాక్షి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, అక్టోబర్ 1న గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ఇటీవలే విడుదలైన ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్‌లో సూరి ఒక సాదాసీదా ప్రయాణికుడిగా కనిపిస్తుంటే.. అతని తోటి ప్రయాణికుడు నివిన్, "నా వయస్సు ఎనిమిది వేల ఏళ్లు" అని చెప్పడంతో సూరి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. "సాధారణంగా 50, 60 ఏళ్లు బతికే మనుషులకే సమస్యలు వస్తే మనసు కంట్రోల్ తప్పి పరిగెడుతుంది.. అలాంటిది 8,000 సంవత్సరాలుగా బతుకుతున్న వాడి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించండి" అంటూ వెనుక వినిపించే వాయిస్ ఓవర్ కథలో ఉన్న డెప్త్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
రైలు ప్రయాణంలో మొదలయ్యే ఈ విచిత్రమైన సంభాషణలు, అడ్వెంచర్స్, వైల్డ్ యానిమల్స్ తో ట్రైలర్ కొత్తగా ఉంది. వినూత్నమైన కథలను ఇష్టపడే సినీ ప్రియులకు 'సంచారి' ఒక విజువల్ ఫీస్ట్ లాంటి అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. మరి ఈ 8,000 ఏళ్ల మిస్టరీ వెనుక ఉన్న అసలైన కథేంటో తెలుసుకోవాలంటే అక్టోబర్ 1 వరకు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: ఊహించని ట్విస్ట్.. నార్త్ ఇండియాలో 'ప్యారడైజ్'కి షాకింగ్ రెస్పాన్స్.!
[Sanchaari Release Trailer, Nivin Pauly New Movie, Sanchaari Telugu Trailer, Yezhu Kadal Yezhu Malai Movie, Nivin Pauly, Anjali, Soori, Telugu Film News, Telugu News]






