
నాని వన్ మాన్ షో 'ది ప్యారడైజ్' నెగిటివ్ టాక్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. ప్రెజెంట్ బుకింగ్స్ అంత ఊపుగా లేకపోవడంతో ఫ్యాన్స్, సినీ ప్రియులు కొంచం డల్ గా ఉన్నారు. ఇలాంటి టైంలో ప్యారడైజ్ లో నటించిన ఒక నటుడు మాత్రం తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు.
రెమో రహీమ్.. ఫిట్ నెస్ ట్రైనర్ తో పాటు సుమారు 70 సినిమాల వరకు క్యారెక్టర్స్ చేసాడు.. ప్యారడైజ్ లో తన క్యారక్టర్ నిడివి ఎడిటింగ్ టేబుల్‌పై దారుణంగా కట్ కావడంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రతీ సినిమా వెనుక నటులు పడే కష్టం, ఆరాటం ఎంతో మహత్తరమైనది. ప్రాణం పెట్టి చేసిన సన్నివేశాలు ఎడిటింగ్‌లో తీసేసినప్పుడు ఆ బాధను వర్ణించడం సాధ్యం కాదు. సినిమాలో నేను నటించిన కీలకమైన 'ట్రక్ సీన్' నిడివి అసలు షూటింగ్‌లో 5 నుంచి 7 నిమిషాల వరకు ఉండేది. ఒక ఆర్టిస్ట్‌గా గుండెల్లో దాచుకున్న ఆశలు, పడిన శ్రమ స్క్రీన్ పై సరిగ్గా కనిపించకపోవడం తనను ఎంతో తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని సోషల్ మీడియా పోస్ట్‌లో ఎమోషనల్ అయ్యాడు రెమో రహీమ్.

ఇది కూడా చదవండి: మమితా బైజు: ఆ కోరిక తీరేదెప్పుడు!
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్ రాధే శ్యామ్, బాహుబలి వంటి చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. ఇక ప్యారడైజ్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది.
[The Paradise, The Paradise Actor Remo Raheem Express Sadness Over Scene Cut,Remo Raheem, Nani, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






