
హిందీ బెల్ట్‌లో లిమిటెడ్ స్క్రీన్స్... దానికి తోడు వర్కింగ్ డే గురువారం రిలీజ్... అయినా సరే, నార్త్ ఇండియాలో నేచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైన నాని మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' మొదటి రోజే హిందీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. తొలి రోజే ఈ చిత్రం ఏకంగా రూ.2.15 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి, నార్త్ ఇండియాలో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది.
నిజానికి 'ప్యారడైజ్' మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. నార్త్ లో పెద్దగా ప్రమోషనల్ హంగామా కూడా లేదు. పైగా పరిమిత థియేటర్లలో విడుదలైంది. అయినప్పటికీ హిందీ గడ్డ మీద మంచి వసూళ్లు రాబడుతుండటం విశేషం.
డే-1 లో సాధించిన ₹2.15 కోట్ల మార్జిన్ కంటే డే-2 బాక్సాఫీస్ బుకింగ్స్ అండ్ ఆక్యుపెన్సీ మరింత స్ట్రాంగ్‌గా ముందుకు సాగుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే అక్కడ థియేటర్ల సంఖ్య పెరిగినా ఆశ్చర్యంలేదు.
ఇది కూడా చదవండి: ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఓ లుక్ వేయాల్సిందే.!

[The Paradise Day 1 Hindi Collections, The Paradise Hindi Collections, The Paradise North India, The Paradise Box Office, The Paradise Collections, The Paradise Movie, Nani Paradise, Telugu Film News, Telugu News]






