ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ రివ్యూ
on Jul 9, 2025
వెబ్ సిరీస్ : ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్
నటీనటులు: అమిత్ సియాల్, షాహిల్ వేద్, భగవతి పెరుమాళ్, గిరిశ్ శర్మ, దానిష్ ఇక్బాల్, విద్యుత్ గార్గి తదితరులు
ఎడిటింగ్: ఫరూక్ హుందేకర్
సినిమాటోగ్రఫీ: సంగ్రమ్ గిరి
మ్యూజిక్: థపస్ రెలియా
నిర్మాతలు: సమీర్ నయ్యర్, నగేశ్ కుకునూర్
దర్శకత్వం: నగేశ్ కుకునూర్
ఓటీటీ: సోనీ లివ్
కథ:
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే21, 1991న ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వెళ్తారు. అక్కడ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా భారీ పేలుడు సంభవిస్తుంది. ఈ ఘటనలో ఆయనతో సహా పదహారు(16) మంది ప్రాణాలు కోల్పోతారు. తెల్లవారేసరికి రాజీవ్ంధీ మరణవార్త విని యావత్ భారత దేశం షాకవుతారు. దీంతో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తాడు. ఈ దాడి వెనుక ఎన్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) ఉందని ఎలా గుర్తించారు? ప్రధాన సూత్రధారి శివరసన్ (షఫీక్ ముస్తఫా) పోలీసులు, సీబీఐ కంటపడకుండా ఎలా తప్పించుకున్నాడు? ఈ క్రమంలో సిట్ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని దాటుకుని శివరసనను పట్టుకున్నారా లేదా అన్నది సిరీస్.
విశ్లేషణ:
యథార్థ సంఘటనలని బేస్ చేసుకొని తీసిన కొన్ని వెబ్ సిరీస్ లు ఇప్పటికే ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాయి. అయితే ఎంగేజింగ్ థ్రిల్లర్ ని చూడాలంటే కాస్త ఓపిక పట్టాలి. అదే ఈ హంట్. 1991లో అసలు సీసీటీవీ కెమెరాలు లేని కాలంలో ఓ హత్యని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసారనేది? ఆ పోలీసులకి ఎదురైన సవాళ్ళు.. అసలు అలా ఎలా ప్లాన్ చేశారు అనే క్యూరియాసిటిని రేకత్తించేదిగా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడేవారు వీకెండ్ కి ఈ సిరీస్ ని చూసేయొచ్చు.
ఈ కథ అందరికి తెలిసిందే.. అయితే ఇందులో కొత్తదనం ఏం ఉంటుందనుకుంటే పొరపాటే.. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. మొబైల్ ఫోన్లు లేని సమయంలో ఒక బాంబ్ ని ఎలా తీసుకొచ్చారు..అసలు ఎవరు ప్రధాన సూత్రధారి.. ఇన్వెస్టిగేషన్ కి ఎందుకంత సమయం పట్టింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ ఎపిసోడ్ ఎంగేజింగ్ గా సాగుతుంది. అయితే ఒక్కో ఎపిసోడ్ నలభై నిమిషాల పైనే ఉంటుంది. ఎందుకంటే దర్శకుడు ఇన్వెస్టిగేషన్ ని క్షుణ్ణంగా చూపించాలనుకున్నాడు. సాలిడ్ ప్రెజెంటేషన్ చేశాడు. అందుకే ఓ రెండు ఎపిసోడ్ ల తర్వాత ఆటోమేటిక్ గా అన్ని ఎపిసోడ్ లు చూసేస్తారు. అయితే అక్కడక్కడ అశ్లీల పదాలు (ఫౌల్ వర్డ్స్) వాడారు. ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూస్తే బెటర్.
1991 లో పోలీస్ ప్రొసీజర్స్ ఎలా ఉండేవి.. అధికారులు కేసులని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు.. ఎలా లీడ్స్ పడతారు.. ఎలా ఇంటరాగేషన్ చేస్తారు.. ఇలా ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ట్విస్ట్ అండ్ సర్ ప్రైజ్ లని ఇస్తూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్ చూశాక ఒక్కటి మాత్రం అందరికి గుర్తుండిపోతుంది. ఆ కాలంలో ఓ హత్య వెనుక ఎంత ప్రణాళిక ఉందో.. దానిని ఇన్వెస్టిగేషన్ చేసేవారికి ఎంత ఓపిక ఉందో తెలుస్తుంది. దాదాపు తొంభై రోజులు ఇన్వెస్టిగేషన్ చేశారంటే దానిని ఎంత ఓపికతో ఇన్వెస్టిగేషన్ చేశారో అర్థమవుతుంది. ఈ సిరీస్ తెలుగు ఆడియోలోను ఉంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బిజిఎమ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎంగేజింగ్ గా సాగే ఈ థ్రిల్లర్ కాస్త ఫౌల్ వర్డ్స్ ఉంటాయి. అవి ఒకే అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు. అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ హంట్.. మిమ్మల్ని చివరిదాకా చూసేలా చేస్తుంది.
నటీనటుల పనితీరు:
శివరసన్ గా షఫీక్ ముస్తఫా, డిఆర్ కార్తికేయన్ గా అమిత్ సియాల్, అమిత్ వర్మగా షాహిల్ వేద్, కె రఘోత్తమ్ గా భగవతి పెరుమాళ్, రాధాగోవింద్ రాజ్ గా గిరిశ్ శర్మ, డాక్టర్ పి. చంద్రశేఖరన్ గా అభిషేక్ శంకర్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : కాస్త నిడివి ఎక్కువగా ఉన్నా ఎంగేజింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మస్ట్ వాచెబుల్
రేటింగ్: 2.75 / 5
✍️.దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
