The Girlfriend: 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ ఫస్ట్ రివ్యూ!
on Nov 6, 2025

రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి రష్మిక అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లోనూ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా 'ది గర్ల్ ఫ్రెండ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. (The Girlfriend)
రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్' సెన్సార్ టాక్ ఇప్పటికే పాజిటివ్ గా ఉంది. ఇక ఇప్పుడు ప్రివ్యూ టాక్ కూడా వచ్చేసింది. సన్నిహితుల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. 'గర్ల్ ఫ్రెండ్' మూవీ చూసిన ప్రతి ఒక్కరూ బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రైటింగ్ బాగుందని, ఎమోషన్స్ తో కట్టిపడేశాడని కొనియాడుతున్నారు. నిజాయితీగా కథ చెప్పే ప్రయత్నం చేశాడని, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని అంటున్నారు. సెన్సిబుల్ రైటింగ్, విజువల్ స్టోరీ టెల్లింగ్ తో మ్యాజిక్ చేశాడని మాట్లాడుకుంటున్నారు.
ఇక రష్మిక నటన సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందని చెబుతున్నారు. భూమా పాత్రలో రష్మిక ఒదిగిపోయిన తీరు గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఖాయమంటున్నారు. దీక్షిత్ శెట్టి కూడా అదే స్థాయిలో తన నటనతో మెప్పించాడట. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకున్నాయట.
మొత్తానికి 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రం మెచ్చుకోదగ్గ ప్రయత్నమని.. రాహుల్ రవీంద్రన్ రైటింగ్, రష్మిక యాక్టింగ్ మ్యాజిక్ చేశాయని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



