మహేశ్-త్రివిక్రమ్ మూవీకి తమన్ మ్యూజిక్
on Apr 18, 2021
.jpg)
సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కలిసొచ్చిన సంగీత దర్శకుల్లో యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకరు. దాదాపు పదేళ్ళ క్రితం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ వెంచర్ 'దూకుడు'.. అటు ఆడియోపరంగానూ, ఇటు సినిమాపరంగానూ సంచలనం సృష్టించింది. ఇక ఇమ్మీడియట్ ప్రాజెక్ట్‌గా వచ్చిన 'బిజినెస్‌మేన్' కూడా కమర్షియల్ గా మెప్పించింది. అయితే, భారీ అంచనాల నడుమ వచ్చిన `ఆగడు` మాత్రం ఆడియోపరంగా ఓకే అనిపించుకున్నా.. బాక్సాఫీస్‌ని ఇంప్రెస్ చేయలేకపోయింది.
ఈ నేపథ్యంలో.. సుదీర్ఘ విరామం అనంతరం 'సర్కారు వారి పాట' కోసం నాలుగోసారి జట్టుకట్టారు ఈ ఇద్దరు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉండగనే.. మరో మూవీ సెట్ అయిందట. ఆ వివరాల్లోకి వెళితే.. 'అతడు', 'ఖలేజా' తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మహేశ్ మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మే 31న పూజాకార్యక్రమాలతో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం. కాగా, ఈ చిత్రానికి కూడా తమన్ బాణీలు అందించబోతున్నాడని బజ్.
అదే గనుక నిజమైతే.. 'అరవింద సమేత', 'అల.. వైకుంఠపురములో' తరువాత త్రివిక్రమ్ కాంబోలో తమన్ చేసే మూడో సినిమా ఇదే అవుతోంది. ఇక మహేశ్ కాంబోలో ఐదో చిత్రమవుతుంది. త్వరలోనే మహేశ్ - త్రివిక్రమ్ కాంబో మూవీలో తమన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



