Home

»

Latest News

ఆసక్తికరంగా మారిన అల్లు శిరీష్ పోలీస్ కంప్లైంట్: ఆంజనేయడి సాక్షిగా ఏం జరుగుతుంది!

Sep 28, 2026 11:15AM

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు ప్రముఖ హీరో అల్లు శిరీష్ చేసిన ట్వీట్ ఇప్పుడు అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. మరి ఆ ట్వీట్ ఏంటి? అందుకు గల కారణాలు ఏంటో చూద్దాం.

హైదరాబాద్  షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ గేటెడ్ కమ్యూనిటీ లో అల్లు శిరీష్ నివాసముంటాడు. తన  నివాస సముదాయం సమీపంలోని వినోబా నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్దంతో మైకులు మోగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులని టాగ్ చేస్తూ ఒక పోస్ట్ చేశారు. దీనికి రుజువుగా సుమారు 9 సెకన్ల విజువల్స్ వీడియోను కూడా జత చేశారు. గతంలోనే తాము ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ సమస్యపై అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు శిరీష్ గుర్తుచేశారు. అప్పట్లో వినాయక చవితి నిమజ్జనోత్సవాలు జరుగుతున్నందున సెప్టెంబర్ 25వ తేదీ వరకు వేచి చూడాలని, పండుగ రద్దీ ముగిసే వరకు సర్దుకుపోవాలని పోలీసులు సూచించారని ఆయన తెలిపారు. అయితే సెప్టెంబర్ 25 ముగిసి, వినాయక నిమజ్జనాలు పూర్తయినప్పటికీ ఆలయం వద్ద లౌడ్ స్పీకర్ల మోత మాత్రం ఆగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: హాలీవుడ్ మూవీ 'హాట్ ఆఫ్ ది బీస్ట్' సంచలనం: కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు,కుక్క ఏమయ్యారు!

 

 

అర్ధరాత్రి వేళల్లో వచ్చే ఈ భరించలేని మైకుల గోల వల్ల తమ సొసైటీలో నివసిస్తున్న వయోవృద్ధులు, చిన్నపిల్లలు, మరుసటి రోజు ఉదయమే ఉద్యోగాలకు వెళ్లే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీవ్ర నిద్రలేమితో అల్లాడిపోతున్నారని శిరీష్ వాపోయారు. గతంలో కూడా కాలనీ వాసులు అనేకమార్లు పోలీసులకు విన్నవించినప్పటికీ ఎటువంటి శాశ్వత పరిష్కారం లభించలేదని ఆయన పేర్కొన్నారు. అనుమతించిన డెసిబెల్ పరిమితులను దాటి సౌండ్ సిస్టమ్స్ ప్లే చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతోందని, అధికారులు వెంటనే రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన బహిరంగంగా కోరారు.

శిరీష్ వేసిన ట్వీట్ పై హైదరాబాద్ సిటీ పోలీస్ స్పందించింది. సదరు సమస్యను తక్షణ చర్యల నిమిత్తం సంబంధిత ఫిలింనగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) కు పంపించినట్లు అధికారికంగా సమాధానమిచ్చారు. సెలబ్రిటీ అయినప్పటికీ ఎలాంటి సంకోచం లేకుండా ఒక పౌర బాధ్యతగా బహిరంగంగా ఈ శబ్ద కాలుష్యంపై గొంతు విప్పినందుకు పలువురు నెటిజన్లు అల్లు శిరీష్‌ను ప్రశంసిస్తున్నారు. దేవుడి పేరుతో అర్ధరాత్రి వేళల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించడం సమంజసం కాదని, అన్ని రకాల ప్రార్థనా మందిరాల్లోనూ ఇటువంటి శబ్ద నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

 

 

[Allu Sirish Police Complaint , Allu Sirish Police Complaint About Loud Music Hyderabad, Allu Sirish, Hyderabad Police complaint, Shaikpet loud music, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com