
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం ’పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. టీజర్‌తో సినిమాపై ఆసక్తిని పెంచిన టీమ్.. ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
థమన్ కంపోజ్ చేసిన ఈ పాటను ప్రభ, రామ్ మిరియాల ఎనర్జిటిక్‌గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. పాటను చూస్తుంటే ఫుల్ మాస్, ఫెస్టివల్ వైబ్ వచ్చేలా డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ పాటలో వెంకటేష్‌తో పాటు శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ సందడి చేయగా.. డింపుల్ హయాతి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆమె ఎనర్జిటిక్ డాన్స్, స్క్రీన్ ప్రజెన్స్ పాటకు మంచి జోష్ తీసుకొచ్చాయి.
ముఖ్యంగా ‘నారాయణమ్మ’ పాటలో వెంకటేష్‌ను కొత్తగా, ఫుల్ ఎనర్జీతో చూపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమాకు ఈ పాట మంచి మాస్ టచ్ ఇచ్చిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో 1.5 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.
ఇది కూడా చదవండి: సర్జరీ విషయంలో నివేదా 'నో' చెప్పడానికి సాయిపల్లవి కారణమా? అసలేం జరిగింది?
అయితే పాటకు వస్తున్న స్పందన పూర్తిగా ఏకపక్షంగా లేదు. పాట ఎనర్జీ, డాన్స్, విజువల్స్ బాగున్నాయంటూ కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం సాధారణంగా త్రివిక్రమ్ సినిమా పాటల్లో ఉండే స్పెషల్ మ్యాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తోంది అంటున్నారు.
త్రివిక్రమ్ సినిమాలు ఎలాగైతే చూసేకొద్దీ నచ్చుతాయో.. ఆయన సినిమాల్లోని పాటలు కూడా వినేకొద్దీ, వాటిలోని మ్యాజిక్ తెలుస్తుంది. ఇప్పుడు నారాయణమ్మ’ సాంగ్ విషయంలో కూడా అదే జరుగుతుంది అనడంలో సందేహం లేదు.
‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 9న థియేటర్లలోకి రానుంది. మరి ‘నారాయణమ్మ’ ఇచ్చిన ఈ మాస్ కిక్.. థియేటర్లలో సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి.
[Aadarsha Kutumbam First Single, Narayanamma Song, Aadarsha Kutumbam Movie Songs, Victory Venkatesh, Trivikram Srinivas, Telugu Songs 2026, Dimple Hayati, Srinidhi Shetty, Nivetha Pethuraj]





