Home

»

Latest News

Karuppu: త్రిష 'కరుప్పు'లో దళపతి విజయ్? ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న క్రేజీ రూమర్!

May 18, 2026

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), సీనియర్ బ్యూటీ త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ 'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు') బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లతో పాటు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ థియేటర్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.  (Karuppu Movie)

ఈ చిత్రంలో దళపతి విజయ్ అతిథి పాత్రలో నటించారంటూ నెటిజన్లు ఒక క్రేజీ సీన్‌ను వైరల్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన 'లియో' (Leo) చిత్రానికి సంబంధించిన ఒక అదిరిపోయే కనెక్టింగ్ రిఫరెన్స్ ఈ సినిమాలో ఉన్నట్లు ఆడియన్స్ గుర్తిస్తున్నారు. సినిమాలోని ఒక కాఫీ షాప్ సన్నివేశం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

'కరుప్పు' సినిమాలో వచ్చే ఒక పర్టికులర్ సీన్ లో ఎవరో ఒక వ్యక్తి కాఫీ ప్రిపేర్ చేస్తున్నట్లు బ్యాక్ ప్రొఫైల్ లో చూపిస్తారు. అయితే ఆ కాఫీ పెడుతున్న వ్యక్తి మరెవరో కాదు.. 'లియో' సినిమాలోని పార్థిబన్ (విజయ్) అని నెటిజన్లు ఊహిస్తున్నారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు.. ఈ సన్నివేశానికి సరిగ్గా ముందే కాఫీ షాప్‌లో ఉండే ఒక సర్వర్.. "నీకు స్పెషల్ లియో కాఫీ తెస్తాను" అని డైలాగ్ చెప్పడం, ఆ వెంటనే కాఫీ మేకింగ్ చేస్తున్న వ్యక్తిని కేవలం వెనక నుంచి మాత్రమే కెమెరా యాంగిల్ లో చూపించడంతో థియేటర్లలో ఆడియన్స్ అరుపులతో దద్దరిల్లిపోయింది. ఈ క్రేజీ సీన్ చూశాక దళపతి విజయ్ నిజంగానే 'కరుప్పు' సినిమాలో ఒక అదిరిపోయే గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారా? అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఈ కాఫీ షాప్ సన్నివేశంలో మరో ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్ ఏమిటంటే.. ఇందులో కనిపించిన నటులు శాండీ, జననీ ఇద్దరూ కూడా గతంలో విజయ్ నటించిన 'లియో' మూవీలోని కేఫ్ సీన్ లో కూడా నటించారు. దీంతో ఇదంతా డైరెక్టర్ ఆర్‌జే బాలాజీ పక్కా ప్లాన్ తో డిజైన్ చేసిన 'లియో' పార్థిబన్ కేఫ్ రిఫరెన్స్ అని, ఆ కాఫీ కప్పు స్టైల్, మేకింగ్ షాట్స్ అన్నీ అలాగే ఉన్నాయని సినీ ప్రియులు కామెంట్స్ పెడుతున్నారు. 

సూర్య 'కరుప్పు' సినిమాతో కమర్షియల్ గా సాలిడ్ కంబాక్ ఇవ్వడమే కాకుండా, ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్స్ తో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఫుల్ పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు. ఈ వైరల్ కాఫీ షాప్ సీన్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చి బాక్సాఫీస్ వసూళ్ల వేగాన్ని మరింత పెంచేలా కనిపిస్తోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com