
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా వస్తుందంటే థియేటర్లలో ఎలాంటి రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్ ఫుల్ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్, ఊరమాస్ తొడగొట్టడాలు, థియేటర్లు దద్దరిల్లిపోయే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్.. ఇప్పటివరకు బాలయ్య సినిమా అంటే ట్రేడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఇదే పక్కా లెక్క! అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇకపై ఆ లెక్క పూర్తిగా మారబోతోంది.
బాలయ్య ఇమేజ్‌ని టోటల్‌గా బ్రేక్ చేస్తూ ఆయనను సరికొత్తగా ప్రెజెంట్ చేయడానికి ఒక క్రేజీ స్టార్ డైరెక్టర్ రంగంలోకి దిగిపోయాడు. టాలీవుడ్‌లో పక్కా కమర్షియల్ సినిమాలకి సైతం అద్భుతమైన క్లాస్ టచ్ ఇస్తూ మెసేజ్ ఓరియెంటెడ్ బ్లాక్‌బస్టర్స్ అందించే డైరెక్టర్ కొరటాల శివ ఈ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ కి స్కెచ్ వేశారు. గతంలో ‘భరత్ అనే నేను’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి ఎంత క్లాస్‌గా, స్టైలిష్‌గా చూపించాడో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే కొరటాల శివ.. మాస్ కా బాప్ బాలయ్య బాబుని ఒక ‘అల్ట్రా స్టైలిష్ ఐకాన్’గా మార్చడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేశారు.
ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఆగస్టులో అఫీషియల్ గా సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌లో బాలయ్య లుక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్. ఇది నార్మల్ మేకోవర్ కాదు.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే ‘బాలయ్య 2.O’ లోడింగ్ అని గంటాపథంగా చెప్పొచ్చు.
మరి ఈ రేంజ్ అల్ట్రా మోడరన్ మేకోవర్ అంటే ఆషామాషీగా ఉంటే సరిపోదు కదా? అందుకే కొరటాల శివ ఏరికోరి బాలీవుడ్ నెం.1 స్టార్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ హకీమ్‌ని ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయిన రజనీకాంత్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి ఎంతోమంది స్టార్స్ లుక్స్ వెనక ఉన్న మ్యాజిక్ హ్యాండ్ ఈయనే. ఆలీమ్ హకీమ్ కేవలం హెయిర్ స్టైల్ మార్చడం మాత్రమే కాదు, ఆయా పాత్రల స్వభావాన్ని బట్టి సరికొత్త క్యారెక్టర్‌ని డిజైన్ చేస్తారనే మంచి పేరుంది.
64 ఏళ్ల వయసులో కూడా అదే ఎనర్జీతో దూసుకుపోతున్న మన బాలయ్య బాబుకి కూడా అలాంటి ఒక పవర్‌ఫుల్ ట్రాన్సిషన్ అవసరమని దర్శకుడు కొరటాల శివ బలంగా భావించారట. బాలకృష్ణ ఏజ్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా.. ముఖంలో వచ్చే గ్రే షేడ్స్‌ని సైతం ఎంతో గ్రేస్‌గా, క్లాసీగా చూపిస్తూ.. బాలయ్య పవర్ ఫుల్ యాటిట్యూడ్‌కి మ్యాచ్ అయ్యేలా ఒక సరికొత్త హెయిర్ స్టైల్, రాయల్ లుక్‌ని ఆలీమ్ హకీమ్ డిజైన్ చేస్తున్నారట. ఎప్పుడూ చూసే రొటీన్ మాస్ లుక్ కాకుండా ఈ సినిమాలో బాలయ్య బాబు హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, నడిచే నడక అంతా సరికొత్తగా ఉండబోతోందని సమాచారం.
కొరటాల శివ మార్క్ ఎమోషన్స్ కి బాలయ్య బాబు నటన తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడే కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఆగస్టులో ప్రారంభం కాబోయే ఈ క్రేజీ కాంబో టాలీవుడ్ లో ఎలాంటి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.






