Home

»

Latest News

Irumudi: రవితేజ 'ఇరుముడి'లో ఊహించని సర్ప్రైజ్.. ఆ ఓల్డ్ గెటప్ వెనుక అసలు రహస్యం అదేనా!

May 18, 2026

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 'ఇరుముడి' (Irumudi) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ఇండస్ట్రీలో ఒక రేంజ్ అంచనాలను క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా ముగింపు దశకు చేరుకుంది. 

ఇటీవల హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సమకూర్చిన ఒక ఎనర్జిటిక్, మాస్ రిథమిక్ సాంగ్ షూటింగ్‌ను కూడా చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల నుండి ఒక మైండ్ బ్లోయింగ్ లీక్ బయటకు వచ్చింది, ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన ఎపిసోడ్ కోసం రవితేజ మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన ఓల్డ్ గెటప్‌లో (వృద్ధుడి పాత్రలో) కనిపించబోతున్నారని గట్టిగా టాక్ వినిపిస్తోంది. రవితేజ కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ ఎక్స్‌పర్మెంట్ అని, ఆ ఓల్డ్ గెటప్ అండ్ దానికి సంబంధించిన సెటప్ మొత్తం థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని ఇన్ సైడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. 

శివ నిర్వాణ రవితేజలోని సరికొత్త నటుడిని ఆవిష్కరించేందుకు ఈ ఓల్డ్ గెటప్ స్క్రిప్ట్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక సాధారణ కమర్షియల్ సినిమా లాగా కాకుండా, ఈ వృద్ధుడి పాత్ర చుట్టూ తిరిగే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి మేజర్ హైలైట్‌గా నిలుస్తుందట. 

ఈ సినిమాలో ఒక అద్భుతమైన డివోషనల్ టచ్ మరియు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఏడాది చివర్లోనే గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ రవితేజ అభిమానులను ఖచ్చితంగా సర్ప్రైజ్ చేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com