సైకిల్‌పై వచ్చి ఓటేసిన సూపర్‌స్టార్.. ఇదే కారణం!
on Apr 6, 2021

దేశంలో ఐదు రాష్ట్రాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో తమిళనాడు కూడా ఉంది. మంగళవారం కోలీవుడ్ సూపర్‌స్టార్స్‌లో ఒకడైన దళపతి విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే ఓటు వేయడానికి అతను తన విలాసవంతమైన కారులో కాకుండా సామాన్యులు వినియోగించే సైకిల్‌పై రావడం టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యింది. పన్నయూర్‌లోని తన ఇంటి నుంచి పోలింగ్ బూత్ దాకా ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి ఓటేశాడు. విజయ్ ఓటు వేయడానికి సైకిల్‌పై వస్తున్నాడనే సమాచారం తెలియగానే ఆయన ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఆయనను అనుసరించారు. అయితే వారినెవరినీ విజయ్ దగ్గరకు రాకుండా పోలీసులు రక్షణగా ఉండి, ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఓటేసేటట్లు చూశారు.
మాస్క్ పెట్టుకొని, బ్లూ జీన్స్, లైట్ గ్రీన్ షర్ట్ ధరించి విజయ్ సైకిల్‌పై వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఆయన అసలెందుకు సైకిల్‌పై వచ్చాడని ఆరాలు తీశారు. పెట్రోలు, డీజిల్ ధరలను సామాన్యులకు అందుబాటులో లేని విధంగా విపరీతంగా పెంచేసుకుంటూ పోతుండటంతో, దానికి నిరసనగానే ఓటేయడానికి విజయ్ సైకిల్ తొక్కుకుంటూ వచ్చాడని కొంతమంది ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇదే విషయంపై డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ పెట్రోల్ ధరలకు నిరసనగానే విజయ్ అలా సైకిల్‌పై వచ్చి ఉంటారని అభిప్రాయపడ్డాడు.
అయితే విజయ్ కారులో కాకుండా సైకిల్‌పై ఓటేయడానికి వచ్చాడో ఆయన వైపు నుంచి క్లారిఫికేషన్ వచ్చింది. తను ఓటేసే పోలింగ్ బూత్ దగ్గర సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో, ఎవరికీ ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఇరుకుగా ఉండే ఆ ప్రదేశానికి సైకిల్‌పై విజయ్ వచ్చినట్లు ఆయన ప్రతినిథి రియాజ్ వెల్లడించాడు.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



