అజిత్ కు హ్యాపీ బర్త్ డే చెప్పిన హీరో విజయ్ తల్లి...!
on May 3, 2016

తమిళనాట హీరో విజయ్ ఫ్యాన్స్ కు, అజిత్ ఫ్యాన్స్ కు అసలు పడదు. ఒకరినొకరు తిట్టుకుంటూ, అప్పుడప్పుడూ కొట్టుకుంటూ కూడా ఉంటాయి ఈ ఫ్యాన్స్ సంఘాలు. కానీ హీరోల మధ్య ఎప్పుడూ అలాంటి వైరాలు ఉండవు. ప్రొఫెషనల్ గా పోటీ ఉంటుంది తప్ప, ఒకరిపై ఒకరికి శతృత్వం మాత్రం ఉండదు. ఇదే విషయాన్ని ప్రూవ్ చేస్తూ హీరో విజయ్ తల్లి శోభ అజిత్ పుట్టిన రోజున విషెస్ చెప్పారు. కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే కాక, అజిత్ రిస్కీ స్టంట్స్ చేస్తూ గాయపడుతున్నాడనే వార్తలు వస్తున్నాయని, ఆ వార్త ఒక తల్లిగా తనకు బాధ కలిగిస్తోందని, అజిత్ జాగ్రత్తగా ఉండాలని ఆమె వీడియోలో కోరారు. ఈ వీడియో ఇప్పుడు తమిళనాట వైరల్ అయింది. ఫ్యాన్స్ అందరికీ ఒకరకంగా కనువిప్పులాంటిదే ఈ సంఘటన అని కోలీవుడ్ సినీజనాలంటున్నారు. అజిత్ కు బిరియానీ బాగా చేస్తాడని పేరుంది. అజిత్ ఒకసారి ఇంటికి వచ్చి తాను చేసిన బిరియానీ తినాలంటూ ఆమె కోరారు. ఇద్దరు స్టార్స్ కు మధ్య యుద్ధం బాక్సాఫీస్ వద్దే కానీ వ్యక్తిగతంగా కాదని ఈ సంఘటన మరోసారి ప్రూవ్ చేసింది. కాగా 45 వ సంవత్సరంలో అడుగుపెట్టిన అజిత్, తన పుట్టిన రోజును ఫ్యాన్స్ మధ్యన సెలబ్రేట్ చేసుకున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



