ఆలోచింపచేస్తున్న "దిల్ సే"
on Feb 7, 2017

యాంకర్ రవి..బుల్లితెరపై తనమార్క్ టైమింగ్‌తో నవ్వులు పూయిస్తూ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తున్నాడు..దీంతో సుదీప్ తర్వాత తెలుగులో మోస్ట్ వాంటెడ్ మేల్ యాంకర్‌గా మారిపోయాడు రవి. షోలు, ఆడియో రిలీజ్‌లే కాకుండా తనలో మంచి నటుడు కూడా ఉన్నాడని నిరూపిస్తున్నాడు..తాజాగా రవి లీడ్ రోల్‌లో నటించిన దిల్ సే అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. స్వచ్ఛభారత్ కాన్సెప్ట్‌ని..దేశం గొప్పతనాన్ని విభిన్నంగా చూపించాడు దర్శకుడు రవికిరణ్ కోలా. రవి చాలా ఛార్మింగ్‌గా..తన నటనతో ఆకట్టకున్నాడు. మోనిక, రమేశ్ ఇతర పాత్రల్లో నటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



