Home

»

Latest News

నాలుగు రోజులు..నాలుగు లక్షల వ్యూస్

Nov 5, 2016 10:47AM

తెలుగునాట షార్ట్ ఫిల్మ్స్‌ అంటే టక్కున గుర్తొచ్చే పేరు తెలుగువన్. ఆ సంస్థ ఏదైనా షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిందంటే దానిలో కంటెంట్ ఓ రేంజ్‌లో ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. తాజాగా నవంబర్ 1న తెలుగువన్ సమర్పణలో రిలీజ్ చేసిన నాకు పెళ్లైంది అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో సునామీ సృష్టిస్తోంది. ఒక షార్ట్ ఫిల్మ్ లైఫ్‌ స్పాన్‌లో సాధించే వ్యూస్‌ని..విడుదలైన నాలుగంటే నాలుగే రోజుల్లో నాలుగు లక్షల వ్యూస్ కొల్లగొట్టి అప్రతిహతంగా దూసుకెళ్తోంది. పెళ్లై భర్త చనిపోయిన ఒక మహిళను ప్రేమించి..ఆమెను మరో పెళ్లికి ఒప్పించే యువకుడి కథతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటీనటుల హావభావాలు, సంభాషణలు ప్రేక్షకుల హృదయాలను బలంగా తాకుతాయి. గౌరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బబ్లూప్రసాద్, కవిత ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com