Home

»

Latest News

ఆయన్ను కోరుకున్నా..కానీ..!

Nov 4, 2016 5:48PM

నిత్యం వివాదాలకు టచ్‌లో ఉంటుంది బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ గారాలపట్టి సోనం కపూర్. సెక్స్‌ గురించి మాట్లాడినా..ఎఫైర్ల గురించి చెప్పినా...బోల్డ్ స్టేట్‌మెంట్లైనా అది సోనమ్‌కే చెల్లుతుంది. అలాంటి వ్యాఖ్యలే చేసి సోనమ్ మరోసారి బీ-టౌన్‌లో బాంబు పేల్చింది. అది కూడా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్‌‌ మీద. భారతదేశంలోని ఏ ఇండస్ట్రీ చూసినా హీరోయిన్లను ఎంపిక చేసుకునేది హీరోలు మాత్రమేనని, ఈ విషయంలో దర్శకనిర్మాతల ఇన్‌వాల్వ్‌మెంట్ చాలా పరిమితమని చెప్పుకొచ్చింది. అందుకు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన కూడా వివరించింది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ అంటే తనకు చాలా ఇష్టమని..ఆయనతో నటించే అవకాశం చాలా సార్లు వచ్చినా అది సెట్స్‌వరకు రాలేదని చెప్పింది. తాను షారుఖ్‌తో నటించాలనుకోవడం కాదు, ఆయనకు ఎప్పుడైతే తనతో నటించాలని ఉంటుందో, అప్పుడు మాత్రమే నాకు ఆ అవకాశం లభిస్తుందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఏ హీరోయిన్‌తో సినిమా చేయాలి..? ఎవరితో వద్దు అనే విషయాల్లో హీరోలదే తుది నిర్ణయమని తేల్చిచెప్పింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com