
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. తెర మీద వినోదాన్ని పంచడం మాత్రమే కాదు..నలుగురిని ప్రేమించడంలోనూ..నలుగురికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న వ్యక్తి. అందుకే ఆయన్ని ఒక నటుడిగా కంటే మానవత్వం మూర్తిభవించిన మనిషిగా పూజిస్తారు అభిమానులు. పవర్‌స్టార్‌ని స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది సినీ తెరంగేట్రం చేశారు..ఇంకా చేస్తూనే ఉన్నారు. వారిలో ఒకరు వర్థమాన దర్శకుడు ప్రసన్న.

చిన్నప్పటి నుంచి పవన్‌ని చూస్తూ పెరిగిన ప్రసన్న ఆయన ప్రేరణతో తన ప్రతిభను చూపించాలనుకున్నారు. అందుకు షార్ట్‌ఫిల్మ్స్‌ని వేదికగా చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన అభిమాన నటుడి పేరునే టైటిల్‌గా చేసుకుని పవన్‌కళ్యాణ్‌కి పెళ్లిచూపులు అనే షార్ట్‌ఫిల్మ్ రూపొందించాడు. తెలుగువన్ సంస్థ రిలీజ్ చేసిన ఈ షార్ట్‌ఫిల్మ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించి రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
.jpg)
ఈ నేపథ్యంలో సన్నిహితుల ద్వారా ఈ షార్ట్‌ఫిల్మ్ గురించి తెలుసుకున్న పవర్‌స్టార్..దానిని వీక్షించి ప్రసన్నను స్వయంగా అభినందించారు. షార్ట్‌ఫిల్మ్‌లా కాకుండా ఒక సినిమా రేంజ్‌లో బాగా తీశావని ప్రశంసించారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రసన్న తన ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. పవన్‌తో గడిపిన ఆ క్షణాలు ఎన్ని ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినా సరిరావు అంటూ అభిమాన నటుడిపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు.
;




.jpg)
.jpg)
