Home

»

Latest News

రికార్డ్‌.. రికార్డ్‌..! బాహుబ‌లి శాటిలైట్ రైట్స్ రూ.55 కోట్లు

Oct 17, 2016 6:19PM

బాహుబ‌లి - ది బిగినింగ్  సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆ ప్ర‌భంజ‌నం జ‌నం ఇంకా మ‌ర్చిపోలేదు. ఈలోగా బాహుబ‌లి - ది క‌న్‌క్లూజ‌న్ త‌న రికార్డుల ప‌రంప‌ర మొద‌లెట్టేసింది. ఇప్ప‌టికే కొన్ని ఏరియాల్లో క‌నీవినీ ధ‌ర‌కు అమ్ముడైన బాహుబ‌లి - 2 శాటిలైట్ రూపంలోనూ స‌రికొత్త రికార్డుల్ని సృష్టించింది. ఈ సినిమా హిందీ రైట్స్  ని సోనీ టీవీ ఛాన‌ల్ రూ.51 కోట్ల‌కు కొనుగోలు చేసింది. మ‌రో రూ.4 కోట్ల వ‌ర‌కూ ప‌న్నుల రూపంలో చెల్లించ‌నుంది. అంటే.. మొత్తంగా శాటిలైట్ కోసం రూ.55 కోట్లు వ‌చ్చించింద‌న్న‌మాట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ ద‌క్షిణాది చిత్ర‌మూ శాటిలైట్ రూపంలో ఇంత మొత్తం ద‌క్కించుకోలేదు.

స‌ల్మాన్‌ఖాన్‌, షారుఖ్, అమీర్ ల సినిమాల‌కు అక్క‌డ దాదాపుగా రూ.90 కోట్ల వ‌ర‌కూ ద‌క్కుతాయి. ఆ త‌ర‌వాత‌... అంత స్థాయిలో శాటిలైట్ ద‌క్కించుకొన్న‌ది ప్ర‌భాస్ సినిమా మాత్ర‌మే. శాటిలైట్ హ‌క్కులు రూ.51 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్టు చిత్ర‌బృందం కూడా అధికారికంగా ధృవీక‌రించింది. తెలుగు హ‌క్కుల వ‌ర‌కూ బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 భాగాల‌ను ఒకేసారి మాటీవీ రూ.25 కోట్ల‌కు చేజిక్కించుకొంది. హిందీలో కేవ‌లం ఒక భాగానికి అంత‌కంటే రెట్టింపు ధ‌ర రావ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com