6 దేశాలు, 23 సెట్స్, 150 రోజులు షూటింగ్.. అడివి శేష్ ‘జీ2’ రేంజ్ ఇదే!
on Aug 4, 2025
టాలీవుడ్ హీరోల్లో అడివి శేష్‌ది ఒక విభిన్నమైన ఆలోచన. తను చేసే ప్రతి సినిమా ఆడియన్స్‌ని థ్రిల్ చెయ్యాలనుకుంటారు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్వతహాగా రచయిత, దర్శకుడు కావడంవల్ల తను చేసే ప్రతి సినిమాకి సంబంధించిన అన్ని దశల్లో అతని ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. అందుకే అతని సినిమా ప్రత్యేకంగా ఉంటాయి. దాదాపు ఏడేళ్ళ క్రితం 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా థ్రిల్ చేసింది. ఇప్పుడా సినిమాకి సీక్వెల్‌గా ‘జి2’ పేరుతో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది మే 1న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
‘జి2’కి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ డేట్‌తో విడుదల చేశారు. గూఢచారి బ్లాక్‌బస్టర్ అవ్వడంతో దాన్ని మించే స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 23 భారీ సెట్స్‌తో 150 రోజులపాటు 6 దేశాల్లో షూటింగ్ జరుపుతున్నారు. ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన స్పౖౖె థ్రిల్లర్‌లను మరపించే విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ సినిమాలో అడివి శేష్‌కి జోడీగా వామికా గబ్బి కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇదే ఆయనకు తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఇతర పాత్రల్లో మురళీశర్మ, సుప్రియ, మధుశాలిని నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



