Home

»

Latest News

స‌ప్త‌గిరికి ఎందుకీ ఎగ‌స్ట్రాలు??

Oct 3, 2016 11:27AM

రాజ‌బాబు నుంచి ధ‌న్‌రాజ్ వ‌ర‌కూ క‌మెడియ‌న్లు గా న‌వ్వించిన‌వాళ్లంతా హీరోలైపోదామ‌ని చూసిన వాళ్లే. అయితే వాళ్ల‌లో స‌క్సెస్ అయిన‌వాళ్లు చాలా తక్కువ మంది. ద‌ర్శ‌కత్వ‌మూ ట్రై చేసిన వాళ్లున్నారు. అయితే.. వాళ్లూ ఫెయిలే. ఇంత ఘోర‌మైన ట్రాక్ రికార్డ్ పెట్టుకొని కూడా కొంత‌మంది క‌మెడియ‌న్లు ఇంకా హీరోయిజం చూపించాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఆ జాబితాలో స‌ప్త‌గిరి కూడా చేరిపోయాడు. స‌ప్త‌గిరికి డిమాండ్ బాగుందిప్పుడు. రోజుకి ల‌క్ష‌కు త‌క్కువ కాకుండా వ‌సూలు చేస్తున్నాడు. నెల తిరిగే స‌రికి రూ.30 ల‌క్ష‌లు చేతిలోకి వ‌చ్చిప‌డుతున్నాయి. అయితే వాటితో సంతృప్తి ప‌డ‌డం లేదు స‌ప్త‌గిరి. త‌న‌లో హీరో ఉన్నాడ‌ని నిరూపించుకోవ‌డానికి ఓ సినిమా చేశాడు.. అదే స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌.

ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది. కేవ‌లం హీరోగానే కాదు.. ర‌చ‌యిత‌గానూ మారిపోయాడు ఈ సినిమాతో. ఓ త‌మిళ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు తానే రాసుకొన్నాడ‌ట‌. డైలాగులూ అత‌నివే. అరుణ్ ప‌వార్‌ని ద‌ర్శ‌కుడు అని చెబుతున్నా.. ఆ విభాగంలోనూ వేళ్లు పెట్టేశాడ‌ని, స‌ప్త‌గిరి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ ఈ సినిమాతో క‌నిపించ‌నున్న‌దని టాక్‌. క‌మెడియ‌న్‌గా నాలుగు రాళ్లు వెన‌కేసుకోద‌గిన స‌మ‌యం ఇది. అలాంట‌ప్పుడు ఇలాంటి ప్ర‌య‌త్నాలెందుకో అర్థంకాదు. క్లిక్ అయితే ఫ‌ర్వాలేదు. హీరోగా నాలుగైదు అవ‌కాశాలు రావొచ్చు. కానీ అలా కొన‌సాగ‌డం క‌ష్టం. ఇప్ప‌టికే న‌రేష్‌, సునీల్ కామెడీ స్క్రిప్టులు లేక త‌ల‌లు ప‌ట్టుకొంటున్నారు. స‌ప్త‌గిరికి అంత ఈజీగా క‌థ‌లెలా దొరికేస్తాయి? ఒక వేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్ర‌భావం తో కామెడీ వేషాలూ దూర‌మైపోతాయి. త‌స్మాత్ జాగ్ర‌త్త

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com