Home

»

Latest News

ట్రైల‌ర్ రివ్యూ : వంగ‌వీటి

Oct 3, 2016 11:18AM

విజ‌య‌వాడ రాజ‌కీయాల గురించి, అక్క‌డ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ గురించి తెలిసిన వాళ్ల‌కు 'వంగ‌వీటి' గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లెద్దు.  అదో.. ర‌క్త చ‌రిత్ర‌. అదో ఆధిప‌త్య పోరు. ఇప్పుడు దాన్నే తెర‌పైకి తీసుకొస్తున్నాడు రాంగోపాల్ వ‌ర్మ‌. అత‌ని నుంచి వ‌స్తున్న మ‌రో య‌దార్థ గాధ  'వంగవీటి'. ఈ సినిమా గుట్టు చ‌ప్పుడు కాకుండా షూటింగ్ పూర్తి చేసుకొంది. ఇప్పుడు ట్రైల‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాదాపు 3 నిమిషాల ఈ ట్రైల‌ర్‌లో వ‌ర్మ చాలా విష‌యాలే చెప్పాడ‌నిపిస్తోంది. నెహ్రూ, గాంధీ పేర్లు వాడి...  త‌న పాత్ర‌లు వేటి చుట్టూ తిరగ‌బోతున్నాయ‌న్న విష‌యం చాలా స్ప‌ష్టంగా చెప్పేశాడు. ట్రైల‌ర్ చూస్తే విజ‌య‌వాడ మార‌ణ‌కాండ‌ని తెర‌పై పూర్తి స్థాయిలో ఆవిష్క‌రించాడ‌నే అనిపిస్తోంది.

అయితే ఆ డైలాగులు, పాత్ర‌ల్ని చూపించిన విధానం... పాత గొడ‌వ‌ల్ని మ‌ళ్లీ కెలుకుతున్నాడ‌న్న భ‌యాన్ని క‌లిగిస్తున్నాయి. కాపు కాసేశ‌క్తి అంటూ ఓ వ‌ర్గాన్ని ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం కూడా చేశాడు వ‌ర్మ‌. సినిమాలో ర‌క్త పాతం ఏ స్థాయిలో చూపించాడో చెప్ప‌డానికి ట్రైల‌ర్‌లో కొన్ని షాట్సే ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తాయి. మొత్తానికి వ‌ర్మ పాత గొడ‌వ‌ల్ని కొత్త‌గా రేపడానికి త‌న క్రియేటివిటీ మొత్తం వాడేశాడు. మ‌రి విడుద‌ల‌య్యాక ఏం జ‌రుగుతుందో?  అస‌లు ఈ సినిమాని బ‌య‌ట‌కు వ‌దులుతారో లేదో అనే అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com