చిరు 150: ప్రీ రిలీజ్ పోస్టర్
on Aug 19, 2016

సుమారు తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తరువాత్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. చిరంజీవి ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు. అసలు టైటిలెంటీ అనే దానిపై ఫుల్ క్లారిటీ రావాలంటే చిరు బర్త్‌డే వరకు వెయిట్ చేయ్యాలని నిర్మాత రాంచరణ్ ప్రకటించారు. ఫ్యాన్స్ కోసమని ఫస్ట్‌లుక్ కంటే ముందు ప్రీ రిలీజ్ పోస్టర్ రిలీజ్ చేశాడు చెర్రి. అందులో కొణిదెల ప్రోడక్షన్ అనే బ్యానర్ నేమ్..హైదరాబాద్ సిటీ అని అర్థమయ్యేందుకు బుద్దుడు..చార్మినార్..గోల్కొండ కోటను చూపించారు. ఇంకేముంది అభిమానుల ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఈ ప్రీ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ప్రీ లుక్ పోస్టరే ఇంత ఆదిరిపోతే..అసలు ఫస్ట్‌లుక్ ఇంకేలా ఉంటుందోనని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అది తెలియాలంటే ఆగస్ట్ 22వరకు వెయిట్ చేయకతప్పదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



