Home

»

Latest News

పవన్ తీన్ మార్ వెయ్యి థియేటర్లలో 4 వేల షోస్

Apr 12, 2011 11:38AM

teen maar wallpapers, teen maar stills, teen maar images, teen maar pics, teen maar photos, teen maar picturesపవన్ "తీన్ మార్" వెయ్యి థియేటర్లలో 4 వేల షోస్ వేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ .సి. పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం"తీన్ మార్". ఈ పవన్ "తీన్ మార్" చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా, ఏప్రెల్ 14 వ తేదీన వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ వెయ్యి థియేటర్లలో నాలుగు వేల షోస్ వేయనున్నారట. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

 

ఈ పవన్ "తీన్ మార్" చిత్రం ఆడియోకి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూంది. హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని "తీన్ మార్" చిత్రంగా రీమేక్ చేస్తున్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ గత చిత్రం"కొమరంపులి" ఫ్లాపవటంతో ఈ చిత్రం మీద పవర్ స్టార్ అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడి పనిచేసినట్లు సమాచారం. ఈ పవన్ "తీన్ మార్" చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com