Home

»

Latest News

రామ్ చరణ్ రచ్చ కి దేవీ శ్రీ ప్రసాద్

Apr 12, 2011 11:31AM

ram charan wallpapers, ram charan stills, ram charan images, ram charan pics, ram charan photos,   ram charan picturesరామ్ చరణ్ "రచ్చ" చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తారని తెలిసింది. వివరాల్లోకి వెళితే యువ హీరో రామ్ చరణ్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, "ఏమైంది ఈ వేళ" ఫేం సంపత్ నంది దర్శకత్వంలో, మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "రచ్చ". ఈ "రచ్చ" చిత్రం కోసం ఎయిట్ ప్యాక్ సాధించేందుకు హీరో రామ్ చరణ్ మియామీలోని అంతర్జాతీయ జిమ్ కు వెళ్ళి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

 

రామ్ చరణ్ "రచ్చ" చిత్రాన్ని ఏప్రెల్ నెలలోనే ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లోనే పూర్తి చేయనున్నారు. ఈ "రచ్చ" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారట. ఈ "రచ్చ" చిత్రం అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రమనీ, ఈ చిత్రం కథ తొలిసారి వినగానే రామ్ చరణ్ ఒ.కె. అన్నారని, ఈ "రచ్చ" చిత్రంలోని ఆయన పాత్ర ఆయనకు ఇంకా బాగా నచ్చిందనీ ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com