25 కోట్ల క్లబ్ లో `టాక్సీవాలా`!!!
on Nov 22, 2018

`అర్జున్ రెడ్డి `, గీత గోవిందం, సినిమాలతో క్రేజీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. లేటెస్ట్ గా విడుదలైన `టాక్సీవాలా` చిత్రంతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే రిలీజ్ కు ముందే ఈ సినిమా పైరసీ బారిన పడటం, విజయ్ దేవరకొండ ముందు సినిమా నోటా డిజాస్టర్ గా మిగలడం, ఎన్నో సార్లు రిలీజ్ లు వాయిదా పడటం...ఇన్ని నెగిటివ్ ల మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈ వెన్ సాధించిన `టాక్సీవాలా` మూడో రోజు నుంచి బయ్యర్లకు లాభాల పంట పండిస్తూనే ఉన్నాడు. మొదటి రెండు రోజుల్లోనే 9 కోట్లకు పైగా షేర్ సాధించి విజయ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ ను మరోసారి నిరూపించింది. వీక్ డేస్ లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ వారం విడదులైన అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్ కావడం, మరో పక్క థియేటర్లలలో చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడంతో విజయ్ దేవరకొండ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తోంది. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చుతండటంతో థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి 25 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం పైరసీ బారి పడినా కూడా బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేయడం విశేషం. దీన్ని బట్టి సినిమా లీక్ లు కూడా కలిసొస్తాయన్నమాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



