ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. నిహారికతో తరుణ్ పెళ్లి.. ఇంతలోనే ట్విస్ట్!
on Aug 2, 2023

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లో తరుణ్ ఒకరు. ఇప్పుడు ఆయన వయస్సు 40 ఏళ్ళు. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసి, హీరోగా మారిన తరుణ్ 'నువ్వే కావాలి', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే నువ్వే' వంటి సినిమాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ఆయన ప్రేమ, పెళ్లికి సంబంధించి అప్పట్లో రకరకాల వార్తలు వినిపించేవి. కొన్నేళ్లుగా సినిమాలు చేయకపోవడంతో ఈమధ్య ఆయన పెద్దగా వార్తల్లో లేరు. అయితే ఉన్నట్టుండి తరుణ్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అది కూడా ఇటీవల విడాకులు తీసుకున్న మెగా డాటర్ నిహారిక తో తరుణ్ పెళ్లి అంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా పెళ్లి వార్తలపై తరుణ్ క్లారిటీ ఇచ్చారు.
'నిహారిక తో తరుణ్ పెళ్లి ఫిక్సయింది' అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం మీద స్పందించిన ఆయన.. ఈ ప్రచారం నిజం కాదని తేల్చి చెప్పారు. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని తరుణ్ అన్నారు. మొత్తానికి తరుణ్ మాటలను బట్టి చూస్తే నిహారికతో అనే కాదు, అసలు ఇప్పట్లో ఆయన పెళ్లి లేనట్లే అని చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



