
అనతికాలంలోనే పాన్ ఇండియా నటిగా గుర్తింపు పొంది ప్రస్తుతం నేషనల్ క్రష్ టాగ్ లైన్ తో వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. ప్రస్తుతం విజయదేవర కొండ తో 'రణబలి' తో పాటు మరిన్ని కీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్ క్రేజ్‌కే సవాల్ విసురుతూ, సోషల్ మీడియాలో ఒక కొత్త అందాల భామ సంచలనం సృష్టిస్తోంది.
ఆ అందాల ముద్దు గుమ్మనే మోడల్ అండ్ నటి తన్యా మిశ్రా. నెట్టింట ఎక్కడ చూసినా తన్యా మిశ్రా హాట్ ఫొటోలు, స్టైలిష్ వీడియోలే వైరల్ అవుతుండటంతో కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. దాంతో అభిమానులు ఇండియాస్ 'న్యూ నేషనల్ క్రష్' అని కొనియాడుతున్నారు. బిహార్‌లోని గయా నగరంలో 1999 జనవరి 31న జన్మించిన తన్యా మిశ్రా, మగధ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పట్టా పుచ్చుకుంది. చదువు పూర్తయ్యాక మోడలింగ్‌పై ఉన్న తీవ్రమైన మక్కువతో గ్లామర్ హబ్ అయిన ముంబై నగరంలో అడుగుపెట్టింది. గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలనే పట్టుదలతో ప్రయాణం ప్రారంభించిన తన్యా, 2019లో జరిగిన 'IAWA మిస్ ఇండియా' పోటీల్లో పాల్గొని 4th రన్నరప్‌గా నిలిచింది.
ఈ విజయంతో ఫ్యాషన్ రంగానికి పరిచయమైన తన్యా, తక్కువ సమయంలోనే ఫెమినా, ఫిల్మ్‌ఫేర్, గ్రాజియా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీలపై మెరిసింది. ముఖ్యంగా ఫెమినా ఏప్రిల్-మే 2024 ఎడిషన్ కవర్ పేజీపై ఆమె లుక్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫ్యాషన్ రంగంలో చూపించిన విశేష ప్రతిభకు గానూ ఫెమినా అచీవర్స్ అవార్డు 2024 మరియు లోక్‌మత్ అవార్డు 2023 సాధించి పరిశ్రమలో నిలదొక్కుకుంది. కేవలం మోడలింగ్‌కే పరిమితం కాకుండా నటన వైపు అడుగులు వేసిన తన్యా, 'ఘజ్నవి' అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత వచ్చిన థ్రిల్లర్ మూవీ 'చేజ్'లో ఏకంగా పవర్‌ఫుల్ సిబిఐ ఇన్‌స్పెక్టర్ పాత్రలో నటించి తనలోని నటిని ప్రదర్శించింది. అంతేకాకుండా, హర్మాన్ బావేజా ప్రొడక్షన్స్ నిర్మించిన 'చిడియా ఉడ్' అనే భారీ బిగ్ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ ప్రముఖ నటులు జాకీ ష్రాఫ్, భూమిక చౌలా, సికందర్ ఖేర్‌లతో కలిసి కీలక పాత్రలో నటించింది. దీనికి తోడు 'నఖ్రో', 'తూ మేరా హో జాయేగా' వంటి 7 ప్రముఖ మ్యూజిక్ వీడియోలలో లీడ్ యాక్ట్రెస్‌గా అలరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన్యా మిశ్రా క్రేజ్ వేగంగా పెరుగుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా 12 లక్షల (1.2 Million) మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇది కూడా చదవండి: మోక్షజ్ఞ డెబ్యూ స్క్రిప్ట్‌పై బాలకృష్ణ కీలక మార్పులు.. సెకండ్ హాఫ్ లో అలా!

ప్రతీ కొత్త ఫొటోషూట్‌లో ఆమె చూపిస్తున్న ఫ్యాషన్ సెన్స్, బోల్డ్ అండ్ గ్లామరస్ లుక్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నేషనల్ క్రష్ అనేది అధికారిక బిరుదు కాకపోయినప్పటికీ, అభిమానులు ఆమె పట్ల చూపిస్తున్న ప్రేమే ఈ పేరుకు కారణమైంది. ఇప్పుడు బాలీవుడ్‌లోని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఆమెతో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోందనే ప్రచారం కూడా నడుస్తోంది. అందుకే అంటారు నిదానంగా అయినా 'తాడిని తన్నే వాళ్ళుంటే తలని దాన్నే వాళ్ళు వస్తారని.
[Tanya Mishra New National Crush India, Rashmika vs Tanya Mishra,Tanya Mishra National Crush,Rashmika Mandanna, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]






