
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రీ-రిలీజ్ వెర్షన్ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’కు భారత్‌లో భారీ స్పందన లభించింది. బాక్సాఫీస్ మోజో ప్రకారం, ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలో సుమారు 86 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ఉత్తర అమెరికాలో 26 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లలో 60 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. దీంతో రీ-రిలీజ్‌లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది.
ఈ చిత్రానికి భారత్ లో కూడా భారీ స్పందన లభించింది. ఫస్ట్ వీకెండ్ లో ఇండియాలో సుమారు 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 కోట్లు) గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు అంచనా. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ అందించిన మార్కెట్లలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు అమెరికా 26 మిలియన్ డాలర్లు, చైనా 13.5 మిలియన్ డాలర్లు, యూకే 5.4 మిలియన్ డాలర్లు, మెక్సికో 4.3 మిలియన్ డాలర్లతో ఉన్నాయి.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మార్వెల్ అభిమానులు మరోసారి థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా కెప్టెన్ అమెరికా చెప్పే “Avengers, Assemble!” సన్నివేశంతో పాటు ఐరన్ మ్యాన్ త్యాగం వంటి ఎమోషనల్ సీన్లను బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ ప్రస్తుతం భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ స్పెషల్ ప్రెజెంటేషన్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’కు కనెక్ట్ అయ్యే అదనపు సన్నివేశాలు కూడా ఉన్నాయి. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ 2026 డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఇది కూడా చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా 'రోమాంచకం' మూవీ.!
[Avengers Endgame Encore Collections, Avengers Endgame Re Release, Avengers Endgame Encore India, Avengers Endgame Encore Box Office, Avengers Doomsday, Avengers Endgame Encore, Telugu Film News, Telugu News]





