
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వచ్చిన తాజా చిత్రం 'రోమాంచకం'. థియేటర్లలో సందడి చేసిన ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైపోయింది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా 'రోమాంచకం' మూవీ రాబోతోంది. ఈ చిత్రం అక్టోబర్ 1 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వచ్చింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విశేషం ఏంటంటే... ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ ఈ చిత్రంలో హీరో హీరోయన్లుగా నటించారు. నూతన దర్శకుడు వేణు గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు.
ఇది కూడా చదవండి: రణబాలి డాక్యుమెంటరీ.. కోటి మంది భారతీయుల ప్రాణాలు తీసిన విషాధ ఘటన.!
[Romanchakam OTT Release Date, Romanchakam Netflix, Romanchakam OTT Date, Romanchakam Movie Telugu, Sandeep Reddy Vanga, Sumanth Prabhas, Ananthika Sanilkumar, Telugu OTT Movies 2026, Telugu Movies]






