గోవాకి గెస్టులుగా పిలిచి అవమానించారు.. బాలయ్య రియాక్షన్!
on Nov 4, 2022

బాలయ్య అనేది పేరు కాదు...పవర్..సాదాసీదా యాక్టర్ కాదు.. అన్ స్టాపబుల్ ఎంటర్టైనర్..మరి బాలకృష్ణ గురించి చెప్పాలంటే చాలా వుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. కానీ అయన ఎంత డిసిప్లిన్ కలిగిన మనిషో ఆయనతో ఉండేవాళ్ళకే తెలుసుతుంది. మరి ఆయన గురించి తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. "సీనియర్ ఎన్టీఆర్ ఎంత డిసిప్లిన్ గా ఉంటారో బాలకృష్ణ కూడా అంతే షూటింగ్ టైంకంటే కూడా ఒక గంట ముందే వచ్చి ఉంటారు. ఆయన మూడీ అని చాలామంది అంటుంటారు కానీ ఏమో నాకయితే అలా ఎప్పుడూ అనిపించలేదు. ఆయనతో నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. గోవాలో 2006 లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి నన్ను పిలిచారు. నేను బాలకృష్ణ గారికి చెప్పాను. అలా ఇద్దరం అక్కడికి వెళ్లాం కానీ వాళ్ళ రిసీవింగ్ అస్సలు బాలేదు. ఒక ఇన్నోవా పంపించేసి ఊరుకున్నారు. ఎవరూ రాలేదు. నేను బాలయ్యతో వెనక్కి వెళ్ళిపోదాం ..ఇక్కడ మనకు రెస్పెక్ట్ లేకుండా పోయింది అనేసరికి వాళ్ళు మనల్ని గౌరవించేది ఏమిటి మన గౌరవం మనకుండాలి కానీ ..వెళ్దాం పదా అని తీసుకెళ్లారు.
అలా వెళ్తుండగా మధ్యలో కార్ ఆపి రోడ్ పక్కన మినరల్ వాటర్ బాటిల్స్ ఒక డజన్ కొని ఆ ట్రేని ఆయనే స్వయంగా తీసుకొచ్చి కారులో పెట్టారు..ఈ రోజుల్లో ఏ హీరో ఐనా ఒక్క బాటిల్ పట్టుకోవాలంటే ఒక అసిస్టెంట్ ఉండాల్సిందే. కానీ ఆయన మనస్తత్వం వేరు..చిన్నపిల్లాడిలా అందరితో కలిసిపోతారు. ఆయన చాలా సింపుల్. నేను ఎన్నో అడగకూడని ప్రశ్నలు కూడా అడిగాను కానీ ఆయన ఎప్పుడూ అంత ఓవర్ రియాక్ట్ అవలేదు.. " అని తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నో విషయాలు చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



