Home

»

Latest News

ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో ప్రాజెక్ట్.. స్పీడ్‌లో ఉన్న సాయిదుర్గాతేజ్.! 

Oct 9, 2026 7:53PM

మెగాహీరో సాయి దుర్గా తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ (SYG) సినిమాతో బిజీగా ఉన్నారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో శ్రీకాంత్, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే సాయి దుర్గా తేజ్ తన తదుపరి ప్రాజెక్టుపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆయన మరో సినిమా చేయనున్నారని, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ కొత్త సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ తొలి సీజన్‌కు దర్శకత్వం వహించిన తేజ కాకుమను ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, కథాంశం, ఇతర సాంకేతిక వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘సంబరాల ఏటి గట్టు’తో పాటు తదుపరి సినిమాతోనూ సాయి దుర్గా తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

 

[Sai Durgha Tej Next Movie, Sai Durgha Tej Upcoming Films, Sambarala Yeti Gattu, Teja Kakumanu, AK Entertainments, Sai Durgha Tej New Movie Update, Telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com